Entertainment Top Stories Today: చంద్రబాబుతో 'అన్‌స్టాపబుల్' ప్రోమో నుంచి ఎన్టీఆర్ 'ఆయుధ పూజ' వరకూ... నేటి టాప్ సినిమా న్యూస్
Entertainment News Today In Telugu: 'బాలయ్య పండగ'లో మొదటి ఎపిసోడ్ ప్రోమో నుంచి 'దేవర' సినిమాలో ఆయుధ పూజ పాట వరకు... నేటి టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏమిటో చూడండి.

నట సింహం నందమూరి బాలకృష్ణ టాక్ షోతో మరోసారి సందడి చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రమాణం నుంచి దేవర సినిమాలో ఎన్టీఆర్ ఆయుధ పూజ పాట వరకు ఈరోజు టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏం ఉన్నాయో ఒకసారి చూడండి.
తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను... చంద్రబాబు వార్నింగ్!
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. ఈనెల 25వ తేదీ నుంచి మొదలు కానుంది. మొదటి ఎపిసోడ్ కోసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన బావ గారు నారా చంద్రబాబు నాయుడుని అతిథిగా తీసుకొచ్చారు. ఆ ఎపిసోడ్ ప్రోమో ఈరోజు విడుదల చేశారు. అందులో కుటుంబ విషయాల నుంచి సరదా సంభాషణలు కొన్ని రాజకీయపరమైన సీరియస్ డిస్కషన్ కొంత జరిగింది.
(అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ప్రోమో చూడడానికి ఈ లింక్ క్లిక్ చేయండి)
దేవర సినిమాలో 'ఆయుధ పూజ' ఫుల్ వీడియో
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా 'దేవర'. అందులో అందరి చేత డాన్స్ చేయించిన సాంగ్ 'ఆయుధ పూజ'. ఈ రోజు ఆ సాంగ్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆడియో సాంగ్ సూపర్ హిట్ కాగా... ఇప్పుడు వీడియో సాంగ్ వైరల్ అవుతోంది.
(దేవర సినిమాలో ఎన్టీఆర్ తన్మయత్వంతో డ్యాన్స్ చేసిన ఆయుధ పూజ సాంగ్ చూడటం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
'పొట్టేల్' సినిమాకు సందీప్ రెడ్డి వంగా ఏం రివ్యూ ఇచ్చారో తెలుసా?
యువ చంద్ర కృష్ణ, అనన్యా నాగళ్ళ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'పొట్టేల్'. కొన్ని రోజులుగా సౌండ్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ అందుకున్న 'యానిమల్' సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ ఈ సినిమా చూశారు. ఆయన ఈ సినిమా గురించి ఏం చెప్పారు? ఎటువంటి రివ్యూ ఇచ్చారు? అనేది తెలుసా?
('పొట్టేల్' సినిమా ఫస్ట్ రివ్యూ... అదేనండీ సందీప్ రెడ్డి వంగా చెప్పిన విషయం చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి)
పది కోట్లు ఇస్తామన్నా పాన్ మసాలా యాడ్ చేయడానికి 'నో'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ మధ్య వార్తల్లో నిలవడానికి కారణం అయ్యింది ఓ పాన్ మసాలా యాడ్. ఆయనకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓ కంపెనీ యాడ్ చేసే సమస్య లేదని చెప్పారు. ఇప్పుడు ఆయన బాటలో నడుస్తూ మరొక బాలీవుడ్ స్టార్ కూడా ఆ మాట చెప్పారు. పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా సరే పాన్ మసాలా యాడ్ చేయడానికి నో చెప్పారు.
(పాన్ మసాలా యాడ్ రిజక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
క్రేజీ హీరోయిన్లతో 45వ సినిమాలో సూర్య రొమాన్స్??
కోలీవుడ్ స్టార్ సూర్య శివకుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నవంబర్ 14న పాన్ ఇండియా సినిమా 'కంగువ'తో ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో వచ్చే హడావిడిలో ఉన్నారు. దీని తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. క్రేజీ హీరోయిన్లతో ఆ సినిమాలో రొమాన్స్ చేయనున్నారని టాక్. మరి, ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరో తెలుసా?
(సూర్య 45వ సినిమాలో హీరోయిన్లు ఎవరో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

