అన్వేషించండి

Suriya 45: సూర్య 45 మూవీలో ముగ్గురు అందాల భామలు... ఇద్దరు క్రేజీ హీరోయిన్లతో సూర్య రొమాన్స్

"సూర్య 45" మూవీలో ముగ్గురు హీరోయిన్లు అనే వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో సూర్య ఇద్దరు క్రేజీ హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతుండగా, మరో హీరోయిన్ కీలక పాత్రలో కన్పించబోతుంది అనే టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya Sivakumar) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే 'కంగువ' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను థియేటర్లలో పలకరించబోతున్న ఈ హీరో నెక్స్ట్ మూవీ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి సూర్య ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లతో...
సూర్య హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'కంగువ' (Kanguva Movie). బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇక ఈ సినిమా తర్వాత సూర్య మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఒకటి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. రెండవ సినిమా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోతున్న మరో సినిమా. ఈ సినిమాలోనే ఆయన ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఆయన కెరీర్లో 45వ సినిమా. 

సూర్య 45లో ముగ్గురు హీరోయిన్లు 
ఆర్జే బాలాజీ చివరగా 'అమ్మోరు తల్లి' అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో నయనతార అమ్మవారిగా కన్పించగా, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ తమిళ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తాజాగా తమిళ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా బజ్ ప్రకారం సూర్య 45వ సినిమా భక్తి ఫాంటసీ సినిమాగా రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. 'సీతారామమ్', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సూర్యతో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటీవల కాలంలో 'సప్త సాగరాలు దాటి' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతుండగా మరోవైపు 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ కాశ్మీరా పరదేశి 'సూర్య 45'వ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికైందని సమాచారం. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు.  కాగా ప్రస్తుతం సూర్య అభిమానుల దృష్టి మొత్తం 'కంగువ'పైనే ఉంది. సూర్య కెరీర్ లో ఇదే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కాగా, సినిమాపై మంచి హైప్ నెలకొంది. మరి ఆ హైప్ ను అందుకుని మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటుందా ? అనేది చూడాలి. 

Read Also : Pottel First Review: 'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget