Entertainment Top Stories Today: బాలయ్య కాళ్లు మొక్కిన సిద్దు, దేవర ప్రీమియర్, రెండు రివ్యూలు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Entertainment News Today In Telugu: 'మత్తు వదలరా 2'తో పాటు 'భలే ఉన్నాడే' ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఆ రెండు సినిమాలు ఉన్నాయి? బాలయ్య, ఎన్టీఆర్, రెజీనా అప్డేట్స్ ఏంటి? అనేది చూడండి.

శుక్రవారం అంటే థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇవాళ రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే'తో పాటు కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహ, సత్య నటించిన 'మత్తు వదలరా 2' థియేటర్లలోకి వచ్చాయి. ఆ రెండు సినిమాల టాక్ ఏంటి? గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ ఏమిటి? ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీస్ ఏంటి? అనేది చూడండి
కాళ్లకు నమస్కరించిన టిల్లు... ముద్దు పెట్టిన బాలయ్య
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే యువ కథానాయకులు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకు గౌరవం. అలాగే అభిమానం. గురువారం వాళ్ళిద్దరిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు బాలకృష్ణ తీసుకు వెళ్లారు. ఏపీలో ఈ మధ్య వచ్చిన వరద సహాయక చర్యలకు వారిద్దరూ అనౌన్స్ చేసిన విరాళాల చెక్కులను అందజేశారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాలకృష్ణ కాళ్ళకు సిద్దు నమస్కరించారు. ఆ తర్వాత అతడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు బాలయ్య. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
(బాలకృష్ణ కాళ్లకు సిద్ధు నమస్కరించిన వీడియోతో పాటు పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
హాలీవుడ్ గడ్డమీద దేవర ప్రీమియర్... ఎన్టీఆర్ నయా రికార్డ్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'దేవర' రికార్డుల పరంపర కొనసాగుతోంది. విడుదలకు రెండు వారాల ముందు అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులో చేరిన సినిమాగా ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ప్రతిష్టాత్మక బియాండ్ ఫెస్ట్ (హాలీవుడ్, లాస్ ఏంజెల్స్ సిటీలో గల ఈజిప్షియన్ థియేటర్)లో ప్రీమియర్ షో వేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ చలనచిత్రోత్సవాల్లో ప్రీమియర్ కానున్న తొలి భారతీయ సినిమా దేవర కావడం విశేషం.
(దేవర ప్రీమియర్ షో కి సంబంధించిన వార్త చదవడం కోసం ఈ లింకు క్లిక్ చేయండి)
'మత్తు వదలరా 2' సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివారా?
ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'మత్తు వదలరా 2'. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఆశించిన విజయాలు గాని మత్తు వదలరా అంత సక్సెస్ గాని అందివ్వలేదు. ఐదేళ్ల తర్వాత సీక్వెల్ సినిమా 'మత్తు వదలరా 2'తో శ్రీ సింహ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమెడియన్ సత్య వన్ మాన్ షో అంటూ క్రిటిక్స్ చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
(మత్తు వదలరా 2 రివ్యూ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ఇప్పుడు నేను సింగిల్... కానీ చాలామందిని డేటింగ్ చేశా!
సాధారణంగా హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు చెప్పడానికి ఆసక్తి చూపించరు. గోప్యంగా ఉంచడానికి చూస్తారు. అయితే రెజీనా రూటే సపరేటు. ఒకప్పటి తన డేటింగ్ లైఫ్ గురించి ఆవిడ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సింగిల్ అయినా సరే... ఇంతకుముందు డేటింగ్ విషయాల గురించి ఉత్సవం విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
(రెజీనా డేటింగ్ లైఫ్ గురించి ఏం చెప్పారో చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి)
'భలే ఉన్నాడే'తో రాజ్ తరుణ్ సక్సెస్ కొట్టారా? రివ్యూ చదివారా?
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ పేరు ఇటీవల సినిమాలతో కంటే వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచింది. ఆ వివాదాల నడుము విడుదలైన ఆయన సినిమాలు 'పురుషోత్తముడు', 'తిరగబడరా సామి' ఫ్లాప్స్ అయ్యాయి. ఇవాళ రాజ్ తరుణ్ కొత్త సినిమా 'భలే ఉన్నాడే' థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడిందా? లేదంటే హిట్ వచ్చిందా?
('భలే ఉన్నాడే' రివ్యూ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

