Devara Premiere at Beyond Fest: అక్కడ 'దేవర' ప్రీమియర్ - హాలీవుడ్‌లో ఆ రికార్డ్ కొట్టిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఎన్టీఆర్‌దే
Devara Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర' బియాండ్ ఫెస్ట్‌లో ప్రీమియర్ కానుంది. లాస్ ఏంజెల్స్‌లో గల ఈజిప్షియన్ థియేటర్‌లో ప్రీమియర్ కానున్న మొదటి ఇండియా సినిమాగా రికార్డు క్రియేట్ చేయనుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NT Rama Rao Jr) టైటిల్ పాత్రలో నటించిన ఫిల్మ్ 'దేవర' (Devara Movie). విడుదలకు ఇంకో రెండు వారాల ఉంది. అమెరికాలో అడ్వాన్డ్స్ బుకింగ్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు 'దేవర' మూవీ మరొక రికార్డ్ క్రియేట్ చేసింది. అది ఏమిటంటే?
బియాండ్ ఫెస్ట్‌లో 'దేవర' రెడ్ కార్పెట్ ప్రీమియర్!
'దేవర' వరల్డ్ వైడ్ రిలీజ్ కంటే ఒక్క రోజు ముందు... ఈ నెల (సెప్టెంబర్) 26వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు బియాండ్ ఫెస్ట్‌లో సినిమా ప్రీమియర్ జరగనుంది. హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠ కల బియాండ్ ఫెస్ట్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్ జరగనుండటం గొప్ప విషయం. ఆ ఫెస్ట్, ఆ థియేటర్‌లో ప్రీమియర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమా 'దేవర' కావడం విశేషం. విడుదలకు ముందు అటువంటి అరుదైన ఘనత ఎన్టీఆర్ సినిమా సొంతం అయ్యింది.
Another reason to celebrate #Devara as it keeps getting bigger and bigger! 🔥
— Vamsi Kaka (@vamsikaka) September 13, 2024
It’s now being screened at Beyond Fest 2024 on September 26th and it’s the only Indian film to make waves here! ❤️
This majestic achievement shows the incredible impact it’s leaving behind 💥💥
'దేవర' రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారని తెలిసింది. ఎన్టీఆర్ సహా దేవర చిత్ర బృందం కూడా అక్కడ సందడి చేయనుంది.
'దేవర' సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు, కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మించారు.
ఎన్టీఆర్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రధారి. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకోతో పాటు అజయ్, చైత్ర రాయ్, 'గెటప్' శీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాకు ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు శిరిల్, సంగీతం: అనిరుద్ రవిచందర్.