అన్వేషించండి

Viral Video: కాళ్లు మొక్కిన టిల్లు, ముద్దు పెట్టిన బాలయ్య- నెట్టింట వైరల్ అవుతున్న లవ్లీ వీడియో

టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డ, నందమూరి బాలయ్య మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరు ఎక్కడ కలిసినా చాలా అప్యాయంగా కనిపిస్తారు. తాజాగా టిల్లు బాలయ్య కాళ్లు మొక్కిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Balakrishna-Siddhu Jonnalagadda Viral Video:  నటసింహం నందమూరి బాలయ్య అనగానే, ఆయనకు చాలా కోపం ఎక్కువ అని చాలా మంది భావిస్తారు. కానీ, ఆ కోపం నీటి బుగలాంటింది. క్షణాల్లోనే మాయం అవుతుంది. బాలయ్య చూపించే ప్రేమ ముందు ఎవరైనా దిగదుడుపే అంటారు ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లు. పబ్లిక్ లో అభిమానుల మీద చెయ్యి చేసుకునే వీడియోలు గతంలో నెట్టింట బాగా హల్ చల్ చేశాయి. కానీ, చాలా మంది అభిమానులు బాలయ్య ఇంటికి వెళ్లి చక్కగా భోజనం చేసి వచ్చిన సందర్భాలున్నాయి. అభిమానులంటే బాలయ్య చాలా ఇష్టపడుతారు. అభిమానులు ఆపదలో ఉన్నారంటే ఇట్టే స్పందిస్తారు. తాజాగా నటుడు సిద్ధు జొన్నలగడ్డ, బాలయ్యకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం ఉందంటే..

బాలయ్య కాళ్లకు నమస్కరించిన టిల్లు

తాజాగా ఏపీ వరద బాధితులకు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ విరాళాలు ప్రకటించారు. గురువారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వారు చెక్కులు అందజేశారు. చంద్రబాబు దగ్గరికి యువ హీరోలు ఇద్దరిని బాలకృష్ణ తీసుకువెళ్లారు. తిరిగి హైదరాబాద్ వచ్చినప్పుడు బాలకృష్ణ కాళ్లకు సిద్దు జొన్నలగడ్డ నమస్కరించారు. బాలయ్య సిద్ధును పైకిలేపి దగ్గరికి తీసుకున్నాడు. బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఎంత మంచి బాడింగ్ ఉందో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

సిద్దూ రూ. 15 లక్షలు… విశ్వక్ సేన్ రూ. 10 లక్షలు

అంతకు ముందుకు బాలకృష్ణ‌ తో కలిసి హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్  హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు ఆఫీస్ కు వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసి వారు ప్రకటించిన ఆర్థికసాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు ఇచ్చారు. విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షల సాయం చేశారు.  

యంగ్ హీరోలతో బాలయ్యకు మంచి ఫ్రెండ్షిప్

గతంలో చాలాసార్లు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడివి శేష్ నా గ్యాంగ్ అంటూ బాలయ్య చెప్పారు. ఏజ్ గ్యాప్ ఉన్నా వీరంతా ఒక్కచోట చేరారంటే అల్లరి మామూలుగా ఉండదు. అంతేకాదు, తన కొడుకు మోక్షజ్ఞకు కూడా వాళ్లను ఆదర్శకంగా తీసుకోవాలని చెప్పినట్లు వెల్లడించారు. గతంలో బాలయ్య టాక్ షోలో పాల్గొన్న సిద్ధు నటసింహం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. బాలకృష్ణకు మంచి మనసు ఉందన్నారు. ఆయన ఎవరినైనా తన సొంత మనిషి అని భాస్తే, వారి కోసం ఎంతదూరమైనా వెళ్తారని చెప్పాడు. బాలయ్యది అందమైన, దయ కలిగిన చిన్న పిల్లాడి మనస్తత్వం అన్నాడు.

Read Also: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget