Ravi Basrurs: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
జూ.ఎన్టీఆర్ కు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. రీసెంట్ గా ఎన్టీఆర్ తన స్టూడియోకి వచ్చిన నేపథ్యంలో 'వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం' అంటూ సాగే పాటను ప్రజెంట్ చేశారు.
Ravi Basrurs Musical Tribute To NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘దేవర’ హీరో కోసం ప్రత్యేకంగా సాంగ్ కంపోజ్ చేసి గిఫ్టు గా ఇచ్చారు. ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ సాగే ఈ పాట ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
రీసెంట్ గా రవి బస్రూర్ స్టూడియోను సందర్శించిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ మీద రవి బస్రూర్ ప్రత్యేకంగా పాటను రూపొందించడానికి ఓ కారణం ఉంది. రీసెంట్ గా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి పలు పర్యాటక ప్రాంతాలతో పాటు పురాతన ఆలయాలను సందర్శించారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ టూర్ లో భాగంగానే.. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్.. రవి బస్రూర్ స్టూడియోను సందర్శించారు. రవి దగ్గరుంచి తన స్టూడియో గురించి వివరించారు. ఈ నేపథ్యంలో తన స్టూడియోకు ఎన్టీఆర్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని పాటగా మార్చి ఎన్టీఆర్ కు గిఫ్టుగా ఇచ్చారు.
అభిమానులు ఆకట్టుకుంటున్న రవి స్పెషల్ సాంగ్
ఎన్టీఆర్ కోసం రూపొందించిన 'వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం' అనే స్పెషల్ సాంగ్ అందరినీ అలరిస్తోంది. ఈ పాటలో రవి బస్రూర్ స్టూడియోను ఎన్టీఆర్ సందర్భించిన దృశ్యాలతో పాటు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి విజువల్స్ ఉన్నాయి. తన స్టూడియోను సందర్శించినందుకు ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్టీఆర్ ను తన స్టూడియోకు తీసుకొచ్చిన ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి కూడా ధన్యవాదాలు చెప్పారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ చిత్రాలతో పాటు ‘సలార్’కు రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమాల్లోని పాటలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి.
View this post on Instagram
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్
అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్నది. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా రవి బస్రూర్ వ్యవహరించనున్నారు. పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ నెల 27న ‘దేవర’ విడుదల
అటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటున్నది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ఇప్పటికే ‘దేవర’కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు.
Also Read: తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్!