Darling Trailer: డార్లింగ్ ట్రైలర్ రివ్యూ... పెళ్ళాం అపరిచితురాలు అయితే? నభాతో ప్రియదర్శి తిప్పలు చూస్తే నవ్వులే
Nabha Natesh Latest Movie: ప్రియదర్శి పులికొండ, నభా నటేష్ జంటగా నటించిన సినిమా 'డార్లింగ్'. జూలై 19న విడుదల కానుంది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు.
Nabha Natesh Upcoming Movies 2024: ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ మూడు ఏళ్ల విరామం తర్వాత నటించిన సినిమా 'డార్లింగ్' (Darling Telugu Movie 2024). 'అల్లుడు అదుర్స్'తో 2021 సంక్రాంతికి ఆవిడ థియేటర్లలోకి వచ్చారు. నితిన్ సరసన నటించిన 'మేస్ట్రో' ఓటీటీలో విడుదల అయ్యింది. కరోనా, ఆ తర్వాత గాయం కావడంతో ఆవిడ కాస్త విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 'డార్లింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఆ మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు.
పెళ్ళాం అపరిచితురాలు అయితే?
ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా 'డార్లింగ్'. ఆయనకు జోడీగా నభా నటేష్ నటించారు. యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకుడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఎలా ఉంది? అంటే...
'డార్లింగ్' సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... 'పెళ్ళాం అపరిచితురాలు అయితే?' అనేది మూవీ కాన్సెప్ట్. యస్... మీరు చదివింది నిజమే! విక్రమ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన 'అపరిచితుడు' గుర్తు ఉందా? అందులో విక్రమ్ స్ప్లిట్ పర్సనాలిటీ రోల్ చేశారు కదా! 'డార్లింగ్'లో నభా నటేష్ చేసిన రోల్ సేమ్ టు సేమ్ అన్నమాట! ఆమెలో అపరిచితురాలు వల్ల భర్త ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా కాన్సెప్ట్!
'డార్లింగ్'లో పెళ్లి చేసుకోవడమే జీవిత లక్ష్యం అన్నట్టు వ్యవహరించే యువకుడి రోల్ చేశారు హీరో ప్రియదర్శి. పెళ్లి చేసుకుని భార్యను పారిస్ తీసుకు వెళ్లాలని అనుకుంటాడు. అయితే, పెళ్ళాం అపరిచితురాలు కావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటిని ఫన్నీగా చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
Also Read: హైపర్ ఆది... నన్ను టచ్ చేయకు - శ్రీ సత్య కామెంట్స్, అతడి పరువు తీసి పారేసిన హన్సిక!
జూలై 19న థియేటర్లలో 'డార్లింగ్' విడుదల
Darling Telugu Movie Release Date: 'డార్లింగ్' సినిమా ఈ నెలలో థియేటర్లలోకి రానుంది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.
Also Read: రీతూ చౌదరి లవర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన విష్ణుప్రియ - ఇదెక్కడి ట్విస్ట్ రా మావ!
Darling 2024 movie cast and crew: ప్రియదర్శి పులికొండ, నభా నటేష్ జంటగా నటించిన 'డార్లింగ్'లో కామెడీ కింగ్ బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల కీలక తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నరేష్ రామదురై, కూర్పు: 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ ఇ రాఘవ, మాటలు: హేమంత్, పాటలు: కాసర్ల శ్యామ్, నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి - శ్రీమతి చైతన్య, రచన - దర్శకత్వం: అశ్విన్ రామ్.