Rithu Chowdary: రీతూ చౌదరి లవర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన విష్ణుప్రియ - ఇదెక్కడి ట్విస్ట్ రా మావ!
Rithu Chowdary Boyfriend: టీవీ స్టార్ రీతూ చౌదరి ప్రేమలో ఉంది. ఆ విషయాన్ని ఆవిడ కూడా ఒప్పుకొంది. అయితే, ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి ఒక సీక్రెట్ బయట పెట్టింది విష్ణుప్రియ! అదేమిటో తెలుసా?
Vishnu Priya Bhimeneni On Rithu Chowdary Lover: కామెడీ కోసం లేదంటే టీవీ షో చూస్తున్న ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవ్వడం కోసం స్కిట్లలో ఆర్టిస్టులను లవ్ చేస్తున్నట్టు ఫిమేల్ ఆర్టిస్టులు యాక్ట్ చెయ్యడం కామన్. 'జబర్దస్త్'లో అజర్ అనే రైటర్ కమ్ ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్నట్టు రీతూ చౌదరి వయ్యారాలు ఒలక బోసింది. అయితే, ఈ అమ్మడు రియల్ లైఫ్ లవర్ వేరే వాడు. అతడి గురించి ఒక షాకింగ్ ఫ్యాక్టర్ బయట పెట్టింది రీతూ చౌదరి ఫ్రెండ్, మరొక ఆర్టిస్ట్ విష్ణు ప్రియ భీమనేని. అది ఏమిటంటే?
విష్ణు ప్రియ ప్రేమించి వదిలేసినోడితో...
రీతూ చౌదరి, విష్ణు ప్రియ భీమనేని క్లోజ్ ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఆ ఇద్దర్ని ఫాలో అయ్యే వాళ్ళకు ఈ సంగతి ఈజీగా అర్థం అవుతుంది. ట్విస్ట్ ఏమిటంటే... ఈ ఇద్దరు ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డారు. అది ఒకేసారి కాదు లెండి. విష్ణు ప్రియ గతంలో ప్రేమించి వదిలేసిన కుర్రాడిని ఇప్పుడు రీతూ చౌదరి లవ్ చేస్తోంది. ఆ సంగతి ఆమెకు లేటెస్టుగా తెలిసింది. అదీ 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో! పూర్తి వివరాల్లోకి వెళితే...
'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' లేటెస్ట్ ఎపిసోడ్ కాలేజీ థీమ్ నేపథ్యంలో చేశారు. ఆ ప్రోమో లేటెస్టుగా రిలీజ్ చేశారు. అది చూస్తే... కంటెస్టెంట్లకు లవ్ లెటర్స్ రాసే టాస్క్ ఇచ్చారని అర్థం అవుతోంది. రీతూ చౌదరి కూడా ఒక లవ్ లెటర్ రాశారు.
'నువ్ నా జీవితంలోకి వచ్చాక షాపింగ్ చెయ్యడం ఆపేస్తా! ఎందుకు అంటే... ఐ వుడ్ లవ్ టు వేర్ యువర్ క్లోత్స్ (నాకు నీ దుస్తులు వేసుకోవడం ఇష్టం)' అని రీతూ చౌదరి తాను రాసిన లెటర్ చదవడం స్టార్ట్ చేసింది. ఆ మాటకు శ్రీముఖి వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. 'అడ్రస్ పెట్టు నువ్వు ఒకసారి' అని మీమ్ వాయిస్ వచ్చింది. దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.
Also Read: ఏకంగా అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
🎉 Get ready for an exciting week on #KiraakBoysKhiladiGirls with a special "College Theme"! Watch thrilling challenges and fun competitions along with Sekhar Master and Anasuya, the fun and excitement are guaranteed! Tune in every Sat & Sun at 9 PM, only on #StarMaa! 🌟 #KBKG pic.twitter.com/KexFXeaPsY
— Starmaa (@StarMaa) July 4, 2024
'నీ కోసం చేసే కాఫీతో నా ఉదయం మొదలు పెట్టాలని అనుకుంటున్నా' అని ఆ లవ్ లెటర్ చదవడం కంటిన్యూ చేసింది రీతూ చౌదరి. 'మీ వాడికి కాఫీ అలవాటు లేకపోతే?' అని రీతూను శ్రీముఖి క్వశ్చన్ చేసింది. మరో వైపు మధ్యలో విష్ణు ప్రియ భీమనేని కలగజేసుకుని 'రీతూ... లేదు లేదు... కాఫీ అలవాటు లేదు' అని గట్టిగా అరిచింది. 'నీకు ఎలా తెలుసు?' అని రీతూ చౌదరి ఎదురు ప్రశ్న వేసింది. ''ఎందుకు అంటే ఆ అబ్బాయి ఇంతకు ముందు నేను ప్రేమించాను కాబట్టి' అని విష్ణు ప్రియ భీమనేని చెప్పడంతో రీతూ చౌదరితో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు.
Also Read: కాలర్ పట్టుకుని లాగి పెట్టి కొట్టిన అనసూయ - మెహదీపట్నంలో ఆకతాయికి మాస్ వార్నింగ్!
సాధారణ మనుషుల జీవితాల్లో జరిగినట్టు ఇండస్ట్రీలో జనాలకు కూడా లవ్, బ్రేకప్ వంటివి ఉంటాయి. ఒకరు బ్రేకప్ అయ్యాక మరొకరితో ప్రేమలో పడటం కామన్. క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఇటువంటి తెలియకుండా జరగడం సర్‌ప్రైజ్.