Anasuya: కాలర్ పట్టుకుని లాగి పెట్టి కొట్టిన అనసూయ - మెహదీపట్నంలో ఆకతాయికి మాస్ వార్నింగ్!
Anasuya mass warning to a boy: అనసూయ అంటే ఆట బొమ్మ కాదు... ఆడ పులి లెక్క. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్ చేస్తే ఇచ్చి పారేస్తోంది. అలాగే, ఓ ఆకతాయికి మెహదీపట్నంలో మాస్ వార్నింగ్ ఇచ్చింది.
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) అంటే ఫైర్ బ్రాండ్! తప్పు జరిగితే ఆమె ఊరుకోదు. ఎవరైనా ఏదైనా తప్పుగా కామెంట్ చేస్తే అసలు ఊరుకోదు. ఆవిడ ఆట బొమ్మ కాదు... ఆడ పులి లెక్క. సోషల్ మీడియాలో ఎవరైనా సరే తనను గానీ, మహిళలను గానీ తక్కువ చేసి మాట్లాడితే ఇచ్చి పడేస్తుంది. అటువంటి వ్యక్తిత్వం ఉన్న ఆమె ముందు ఆకతాయిలు ఎగతాళి చేయాలని చూస్తే ఊరుకుంటుందా? లాగి పెట్టి ఒక్కటి ఇచ్చింది. ఓ అబ్బాయి చెంప చెళ్లుమనిపించిన రోజులు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
అనసూయ కాలేజీ చదివే రోజుల్లో...
అనసూయది తెలంగాణ. పైగా, ఆమె కాలేజీ చదువు అంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాల్లో జరిగింది. మెహదీపట్నంలోకి ఓ కాలేజీలో ఆమె చదువుకుంది. అక్కడ అమ్మాయిలు ప్రతి రోజూ కాలేజీ అయ్యాక బయటకు వచ్చినప్పుడు కొంత మంది ఆకతాయిలు కావాలని ఏడిపించేవారట. ర్యాగింగ్ చేసేవారట. 'కిదర్ జారే...' (ఎక్కడికి వెళుతున్నావ్) అంటూ మీద మీదకు వస్తుంటే....
''ఎక్కడైనా కొందరు ఉంటారు కదా! వాళ్ళూ అలాగే. 'కిదర్ జానా (ఎక్కడికి వెళ్ళాలి) అంటూ వచ్చారు. ఒక రోజు కాలర్ పట్టుకుని లాగి పెట్టి కొట్టాను. గట్టిగా ఒక్కటి ఇచ్చా. ఆగండి వస్తా కదా'' అని 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో తెలిపారు.
కాంట్రవర్సీకి కారణమైన విజువల్స్ వచ్చేది ఆదివారమే!
'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో అనసూయ బుల్లితెరపై మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ప్రజల్లో ఆవిడకు క్రేజ్ వచ్చిందే టీవీ షోస్ వల్ల. 'జబర్దస్త్'తో ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. అయితే కొన్నాళ్లుగా ఆవిడ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. 'జబర్దస్త్' నుంచి తప్పుకొన్నారు. కానీ, ఈ 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్'తో మళ్ళీ టీవీలో ఎంట్రీ ఇచ్చారు.
Kiraak Boys Khiladi Girls Show: 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన రచ్చకు అయితే లెక్క లేదు. మరీ ముఖ్యంగా అనసూయ బ్లేజర్ విప్పిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఆ విజువల్స్ లేవు. అందులో కేవలం ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు, ఏడుగురు ఫిమేల్ కంటెస్టెంట్లను మాత్రమే పరిచయం చేశారు. బహుశా... ఆదివారం ప్రసారం అయ్యే రెండో ఎపిసోడ్‌లో అనసూయ, శేఖర్ మాస్టర్ మధ్య జరిగే టాస్కులో ఆ విజువల్స్ వచ్చే అవకాశం ఉంది.
అనసూయ బ్లేజర్ విప్పడం మీద వచ్చిన విమర్శలకు సోషల్ మీడియాలో ఆవిడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇష్యూలో ఆమెకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు పోస్టులు చేశారు.
Also Read: అందుకే అలా చేస్తాం.. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా ఇబ్బందే - ‘జాకెట్’ ట్రోల్స్‌కు అనసూయ కౌంటర్