అన్వేషించండి
Satyabhama Serial Today December 13 Highlights : మహదేవయ్య విశ్వరూపం బయటపెట్టేసిన సత్య.. క్రిష్ రియాక్షన్ ఏంటి - సత్యభామ డిసెంబరు 13 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

satyabhama serial December 13 episode Highlights
1/9

కరెంట్ ఆఫీస్ కి వెళ్లిన క్రిష్ అక్కడి సిబ్బందిని బెదిరించి వస్తాడు. ఆ తర్వాత మహదేవయ్యకు కాల్ చేసిన ఉద్యోగులు..ఒకే ఇంటి నుంచి రెండు బెదిరింపులేంటని ప్రశ్నిస్తారు. కాల్ కట్ చేసిన మహదేవయ్య కరెంట్ వచ్చినా కానీ దెబ్బ మీద దెబ్బ కొడతా అనుకుంటాడు
2/9

చిన్న కోడలు పుట్టింట్లో తిష్టవేసిందని భైరవి వచ్చి కోప్పడుతుంది. నాకు తెలియకుండా ఎందుకు పంపించావ్ అంటూనే..కొన్ని రోజులు చిన్నకోడలు పుట్టిల్లు వదిలిరాదు..పనులన్నీ నువ్వే చేసుకో అంటాడు. అయితే గంగను పిలుస్తాలే అని గట్టిగా నవ్వుతాడు..
3/9

కరెంట్ వచ్చిందా అని క్రిష్ అంటే మీ పవర్ కి పవర్ వచ్చింది బావా అంటుంది సంధ్య. ఇంట్లో అందరూ థ్యాంక్స్ చెబుతారు. కష్టాన్ని ఈ ఇంటి గడపదాటిరానివ్వకుండా క్రిష్ కాపాడతాడు అంటుంది సత్య. నీకు తెలియకుండా మీ బాపు చేసే అన్యాయంతో యుద్ధం చేస్తున్నా తెలిసే రోజుకోసం ఎదురుచూస్తున్నా అనుకుంటుంది సత్య..
4/9

ఇంతలో 25 లక్షలు ఇవ్వమని అడిగేందుకు వస్తారు రౌడీలు.వాళ్లు అమర్యాదగా ప్రవర్తించడంతో క్రిష్ ఫైర్ అవుతాడు. మూడు నెలల తర్వాత కనపడండి..పైసా ఇప్పుడు ఇచ్చేదేలే అంటాడు క్రిష్. ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది కదా చెప్పవయ్యా పెద్దమనిషి అంటారు. నేను మాటిచ్చాను అంటాడు విశ్వానాథం
5/9

వాళ్లు రాక్షసులు బావగారు..కిందటిసారి చాలా గొడవచేశారని సంధ్య చెబుతుంది.మామ చెప్పారని ఆగుతున్నా అంటాడు. ఓ గంట ఆగండి అని చెప్పి క్రిష్ ఇంటికి వెళతాడు. సత్య కూడా క్రిష్ ని అడ్డుకోదు. హర్ష చికాకుపడుతుంటే.. చిన్నన్న డబ్బు తెచ్చాక అప్పుడు చెప్తా ఆ రౌడీల పని అనుకుంటుంది.
6/9

హర్షకి..మైత్రి కాల్ చేస్తుంది. ఏంటి తల్లీ చేసింది సరిపోలేదా నీ కోసం చేసిన అప్పులవల్ల రోడ్డునపడ్డాం ఇక మా జోలికి రాకు అంటుంది. అప్పుడు కూడా హర్ష..నందినిపై ఫైర్ అవుతాడు. ఇంతలో సత్య వచ్చి హర్షకి క్లాస్ వేస్తుంది..
7/9

క్రిష్ వచ్చి 25 లక్షలు కావాలని మహదేవయ్యను అడుగుతాడు..మరోవైపు భైరవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. జయమ్మ వచ్చి ఇంటి కోడలిని ఆదుకోవాలి అంటుంది. మహదేవయ్య డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. నాకోసం చిన్నా ఏమైనా చేస్తాడు..నేను వాడికోసం ఏమైనా చేస్తానంటాడు మహదేవయ్య.
8/9

మహదేవయ్య మాత్రం..నా ప్లాన్స్ నాకుంటాయ్ అనుకుంటాడు. క్రిష్ డబ్బు తీసుకుని అత్తారింటికి వెళతాడు..
9/9

సత్యభామ డిసెంబర్ 14ఎపిసోడ్ లో...ఇల్లు కొలతలు తీసుకుంటాం అంటూ వేరేవాళ్లు వస్తారు.అడ్డుకున్న విశ్వనాథం కుటుంబంతో ఇది మీ ఇల్లు కాదు అంటారు. మా బాపుకి కాల్ చేస్తానని నందిని అంటుంది. వద్దు వదినా..ఈ సమస్యకి కారణమే మీ బాపు అని చెప్పేస్తుంది సత్య...
Published at : 13 Dec 2024 10:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion