Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Kiraak Boys Khiladi Girls Full Promo: స్టార్ మా లేటెస్ట్ గేమ్ షో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో అనసూయకు లవ్ లెటర్ రాశాడొకడు. అతడు ఎవడో చూడండి.
Tasty Teja: టేస్టీ తేజ తెలుసుగా! 'జబర్దస్త్' వంటి కామెడీ ప్రోగ్రామ్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా అతడు చేసే ఫుడ్ వ్లాగ్స్ సైతం పాపులర్. ఆ షోస్ కంటే అతడికి స్టార్ మా ఛానల్ 'బిగ్ బాస్' ఎక్కువ రికగ్నైజేషన్ తెచ్చింది. ఆ టేస్టీ తేజ ఇప్పుడు స్టార్ మా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త గేమ్ షో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' (Kiraak Boys Khiladi Girls)లోనూ కంటెస్టెంటుగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ శని, ఆది వారాల్లో ప్రసారం అయ్యే ఎపిసోడ్ కోసం అతడు ఓ లవ్ లెటర్ రాశాడు. అదీ ఏకంగా అనసూయకు!
అనసూయకు టేస్టీ తేజ లవ్ లెటర్!
Kiraak Boys Khiladi Girls Latest Full Promo: 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' లాంచ్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ వైరల్ అయ్యింది. అందులో కేవలం కంటెస్టెంట్లను మాత్రమే పరిచయం చేశారు. అందులో కొన్ని టాస్కులు ఉన్నప్పటికీ అనసూయ బ్లేజర్ విప్పిన సీన్ ఫుల్ వైరల్ అయ్యింది. అసలు సిసలైన మజా ఈ శని, ఆది వారాల్లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లలో ఉంటుంది. కాలేజీ థీమ్ బేస్డ్ ఎపిసోడ్స్ చేశారు. ఆ ప్రోమో లేటెస్టుగా విడుదల చేశారు. అందులో లవ్ లెటర్ రాసే కాన్సెప్ట్ టాస్క్ ఒకటి ఉంది.
'సూయ సూయ సూయ అనసూయ' అంటూ శ్రీముఖి చదవడం మొదలు పెట్టిన తర్వాత 'ఏంటి? నాకే లవ్ లెటర్ రాశాడా?' అని అనసూయ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ లెటర్ రాసినది టేస్టీ తేజ. 'స్కై ఈజ్ బ్లూ... మై హార్ట్ యు' అని అతడు రాసిన లైన్ విన్న తర్వాత చేతులతో హార్ట్ సింబల్ చూపించింది అనసూయ.
Also Read: కాలర్ పట్టుకుని లాగి పెట్టి కొట్టిన అనసూయ - మెహదీపట్నంలో ఆకతాయికి మాస్ వార్నింగ్!
ముద్దులు వద్దంటున్న శేఖర్ మాస్టర్!
'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' లాంచ్ ఎపిసోడ్ లేదా ప్రోమో ఎవరైనా చూసినట్లు అయితే నటి ఆయేషా జీనత్ ఓ టాస్కులో భాగంగా శేఖర్ మాస్టరును ముద్దులతో ముంచెత్తింది. దాని గుర్తు చేస్తూ... లాంచ్ ఎపిసోడ్ తర్వాత ఇంట్లో పరిస్థితి ఏమిటి? అని శ్రీముఖి అడిగింది. ఈసారి ఎవరి నుంచి ముద్దులు కోరుకుంటున్నారు? అని అడగ్గా... అటువంటివి ఏమీ వద్దని చెప్పాడు శేఖర్ మాస్టర్.
అనసూయ మీద కూడా శ్రీముఖి పంచ్ వేసింది. 'మీరు ఫోనుతో చాలా బిజీగా ఉన్నారు' అని అన్నది. అంటే ఆ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యాక వచ్చిన కాంట్రవర్సీలకు సోషల్ మీడియాలో అనసూయ రిప్లైలు ఇస్తూ వచ్చారు కదా! దాన్ని గుర్తు చేసింది శ్రీముఖి. ఈసారి ప్రోమో అయితే ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ఫన్నీగా సాగింది. మరి, ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో మరి!