రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు
పంజాబ్‌కు చెందిన 101 మంది రైతుల బృందం ఆదివారం కూడా మధ్యాహ్నం నాటికి ఢిల్లీకి చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. వారు ఢిల్లీకి రాకుండా Haryana-Punjab Shambhu Border వద్ద కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. శుక్ర, శనివారాల్లోనూ పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో రైతులు తమ పాదయాత్రను వాయిదా వేశారు. కానీ, తమ డిమాండ్లకు మద్దతుగా శంభు సరిహద్దులో తమ ఆందోళనను రైతులు కొనసాగించారు. రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా సరిహద్దులో బారికేడింగ్ తో పాటుగా రోడ్లపై ఇనుప మేకులను కూడా ఏర్పాటు చేశారు. యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా రైతు సంస్థలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో భారీ రైతు నిరసనల సందర్భంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం, పంటలకు కనీస మద్దతు ధరకి చట్టపరమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా 2021 నాటి లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం కోసం రైతు సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైతులు, రైతు కూలీలకు పింఛన్లు అమలు చేయాలని డిమాండ్ కూడా ఉంది. కరెంటు రేట్లు పెంచవద్దనే డిమాండ్ కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తాము ఎదురుచూస్తున్నామని, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదని, అందుకే పాదయాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు రైతు నాయకుడు సర్వన్‌సింగ్ పంధేర్ అన్నారు.