Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Best Electric Car: ఇటీవలే మార్కెట్లో మహీంద్రా బీఈ 6ఈ లాంచ్ అయింది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీలతో ఈ కారు పోటీ పడనుంది. మరి ఈ మూడు కార్లలో ఏది బెస్ట్ అని చెప్పవచ్చు?
Electric Cars In India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ మారుతోంది. మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రజలకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఈ విభాగంలో కొత్త ఎలక్ట్రిక్ కారు బీఈ 6ఈని కూడా విడుదల చేసింది. ఈ కారు మిగతా ఎలక్ట్రిక్ కార్లకు మంచి పోటీని ఇచ్చే ధరతో వచ్చింది. టాటా ఎలక్ట్రిక్ కార్లు నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలకు, దీనికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.
ఏ ఎలక్ట్రిక్ కారు పెద్దది?
టాటా నెక్సాన్ ఈవీ అనేది నాలుగు మీటర్ల కంటే తక్కువ సైజు కలిగిన ఎలక్ట్రిక్ కారు. కర్వ్ ఈవీ, బీఈ 6ఈ కార్లు నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవు గల కార్ల జాబితాలో ఉన్నాయి. మహీంద్రా కారు ఇతర రెండు ఈవీల కంటే వెడల్పుగా ఉంది. దీనితో పాటు మహీంద్రా ఎలక్ట్రిక్ కారు పొడవైన వీల్‌బేస్‌ను కూడా కలిగి ఉంది. కర్వ్ ఈవీ మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. బూట్ స్పేస్ గురించి చెప్పాలంటే నెక్సాన్ ఈవీ, బీఈ 6ఈ కంటే కర్వ్‌లో ఎక్కువ స్పేస్ ఉంది.
ఏ ఈవీ ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి?
మహీంద్రా బీఈ 6ఈ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ... మూడు ఎలక్ట్రిక్ కార్లు మెరుగైన టెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఇది ఈ కార్లకు గొప్ప ఫీచర్లను అందిస్తుంది. మూడు ఎలక్ట్రిక్ కార్లు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉన్నాయి. టాటా కార్లలో జేబీఎల్ ఆడియో సిస్టం ఉంటుంది. లెవెల్ 2 ఏడీఏఎస్, వెంటిలేటెడ్ సీట్లు, సౌండ్ అలర్ట్ వంటి ఫీచర్లు కర్వ్‌లో అందించారు.
మహీంద్రా ఎలక్ట్రిక్ కారులో గొప్ప ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులో అన్ని టాటా ఈవీల లాగా యాంబియంట్ లైటింగ్ ఉంది. కానీ బీఈ 6ఈలో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది. మహీంద్రా కారును రిమోట్ కంట్రోల్ ద్వారా ఆటో పార్క్ చేయవచ్చు. ఈ కారులో సెల్ఫీ కెమెరా, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ - విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్!
ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ ఎంత?
మహీంద్రా బీఈ 6ఈ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారులో అందించిన 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 228 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. అలాగే 5353 కిలోమీటర్ల రేంజ్‌ను డెలివర్ చేస్తుంది. ఇక 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ 282 బీహెచ్‌పీ శక్తిని, సింగిల్ ఛార్జ్‌తో 682 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
టాటా కర్వ్ ఈవీ 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 502 కిలోమీటర్లు, 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 585 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఈ కారులో అందించిన మోటార్ 167 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. అలాగే 215 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ ఈవీలో 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌లో 489 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే సమయంలో ఈ కారు 145 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
ఏ ఈవీ కొనుగోలు చేయడం బెస్ట్?
టాటా కర్వ్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 17.4 లక్షల నుంచి మొదలై రూ. 21.9 లక్షల వరకు ఉంటుంది. నెక్సాన్ ఈవీ ధర రూ. 12.4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దాని టాప్ మోడల్ ధర రూ. 17.19 లక్షలుగా ఉంది. మహీంద్రా ఇప్పటివరకు బీఈ 6ఈ ప్రారంభ ధరను మాత్రమే వెల్లడించింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 18.9 లక్షలుగా ఉంది.
Also Read: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!