ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా పెద్దపులి జిల్లాలో సంచరిస్తూ హడలెత్తిస్తోంది. ఇదివరకు పశువులపై దాడి చేసిన పెద్దపులి మనుషుల పైన దాడులు చేస్తోంది. సిర్పూర్ కాగజ్ నగర్ కారిడార్ లో మనుషులపై దాడి చేసిన పెద్దపులి ఇటుకల పహాడ్ ప్రాంతంలో తిష్ట వేసిందనీ భావిస్తున్నారు. పులి జాడ కోసం డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డప్పు చాటింపు ద్వారా గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నారు. పులి దాడి నేపద్యంలో ఇదివరకు సిర్పూర్ నియోజకవర్గంలోని 15 గ్రామాలలో ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నిరజ్ కుమార్ టిబ్రేవాల్ 144 సెక్షన్ అమలు చేశారు. అక్కడి ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నందున ఎవరు వెళ్లకూడదని చెప్పారు. ఈ విషయం ఇదివరకు తెలిసిందే. ఇటుకల అటవీ ప్రాంతంలో పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరు, సిసిఎఫ్ శాంతారం, ఆసిఫాబాద్ డి ఎఫ్ ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అటవీ శాఖ సిబ్బందితో కలిసి అక్కడి ప్రాంతాలను పరిశీలించారు పులి అడుగుజాడలను వాటి పాదముద్రలను గమనించారు.