అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Satyabhama Serial Today December 07 Highlights :'స్పైడర్' లో సూర్యలా తయారైన మహదేవయ్య .. విలవిల్లాడుతున్న సత్య- సత్యభామ డిసెంబరు 07 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది..కొత్త ప్రయత్నాల్లో పడింది సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
satyabhama serial December 07 episode Highlights
1/8

క్రిష్-సత్య కారులో వెళుతూ ఇద్దరూ సెటైర్స్ వేసుకుంటారు. కాసేపు సరదాగా నవ్వుకుంటారు. గంగపై నీ అభిప్రాయం ఏంటి అని అడుగిన క్రిష్ తో ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అంటుంది. ఆమె వెనుక ఎవరో ఉన్నారు వాళ్లెవరో కనిపెడతా అంటాడు క్రిష్. సత్య కంగారు పడుతుంది. కాసేపట్లో నీకు నిజం తెలుస్తుంది అనుకుంటుంది
2/8

సంధ్యను బైక్ పై ఎక్కించుకుని వెళుతున్న సంజయ్..క్రిష్ కారును క్రాస్ చేస్తాడు. వెనుకే సంధ్యను గమనించిన సత్య వెంటనే కాల్ చేస్తుంది. కంప్యూటర్ క్లాసులో ఉన్నానని అబద్ధం చెబుతుంది సంధ్య. దాదాపు దొరికిపోయేవారం అంటుంది సంధ్య..
3/8

క్రిష్-సత్య...ఆ నర్స్ ఇంటికి వెళ్లోలోగానే మహదేవయ్య మనుషులు వచ్చి నర్స్ మేరీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి అడిగినా మేం తన చుట్టాలం అని అబద్ధం చెబుతారు. ఆ వ్యాన్ క్రిష్-సత్యను క్రాస్ చేసి వెళుతుంది.
4/8

మేరీ ఇంటిదగ్గరకు వెళ్లిన సత్యతో.. ఆమెను ఎత్తుకెళ్లిపోయారని చెబుతారు. అంటే ఇది కచ్చితంగా మావయ్య మహదేవయ్య పనే అయి ఉంటుంది అనుకుంటుంది సత్య. మనం ఫాలో అవుదామా అని క్రిష్ అంటే దొరకలు, అవకాశం చేజారిపోయినట్టే అని బాధపడుతుంది. ఇక ఆవిడ ఎవరికీ కనిపించదు నేను తప్పుచేశాను అనుకుంటుంది
5/8

తిరిగి ఇంటికి వెళుతుండగా సత్య డల్ గా కూర్చుంటుంది. నువ్వు హెల్ప్ చేద్దాం అనుకున్నావ్ మీ ఫ్రెండ్ వాళ్ల అమ్మకు అదృష్టం లేదు అని ఓదార్చుతాడు క్రిష్.
6/8

హనీమూన్ వెళదామా అని క్రిష్ అడిగితే రేపే వెళదాం అంటుంది సత్య. బాపూ MLA టికెట్ కన్ఫర్మ్ అయ్యాక వెళ్దాం అని క్రి్ అంటే.. బాపూ నీ కన్నతండ్రి కాదని తేలాకే వెళదాం అని సత్య అనుకుంటుంది.
7/8

మైత్రి బర్త్ డే సందర్భంగా ఇంటికెళతాడు హర్ష. చీరకట్టుకుని అందంగా రెడీ అయి వస్తుంది మైత్రి.. ఎలా ఉన్నానని అడుగుతుంది. అందంగా ఉన్నావని కాంప్లిమెంట్స్ ఇస్తాడు హర్ష. మేడమీదకు తీసుకెళ్లి కేక్ కట్ చేయించి తినిపిస్తాడు..మైత్రి సంతోషిస్తుంది
8/8

ఇంతలో నందిని కాల్ చేస్తుంది... కాల్ కట్ చేసిన హర్షతో..నాతో డిన్నర్ చేయి రాత్రంతా ఇక్కడే ఉండు అంటుంది. నువ్వు రోజురోజుకీ నాపై డిపెండ్ అవుతున్నావ్ అది నీకు నాకు ఇద్దరికీ మంచిదికాదు. నీకు నువ్వుగా ఉండడం నేర్చుకో..నాకోసం టైమ్ వేస్ట్ చేస్తూ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దని చెప్పి వెళ్లిపోతాడు..
Published at : 07 Dec 2024 10:33 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆటో
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















