Yamaha EC 06 vs River Indie: ఏ స్కూటర్ బెస్ట్? డిజైన్ నుంచి ధర వరకు సింపుల్‌గా అర్ధమయ్యే ఎక్స్‌ప్లనేషన్
River Indieపై ఆధారపడి ఉన్న స్కూటర్ Yamaha EC 06. డిజైన్, స్టోరేజ్, ఛార్జింగ్ టైమ్ నుంచి అంచనా ధర వరకు ఈ రెండింటి మధ్య ఉన్న మార్పులు ఇవి.

Yamaha EC 06 vs River Indie Electric Scooter Comparison: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ల సంఖ్య పెరుగుతోంది. కానీ Yamaha EC 06 మాత్రం ప్రత్యేక అటెన్షన్ పొందుతోంది. కారణం... ఇది పూర్తిగా River Indie ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న మోడల్. Yamaha, ప్రపంచ మార్కెట్లోకి తీసుకు రాబోయే ఫస్ట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీనిని ఇటీవలే మార్కెట్‌కు పరిచయం చేసింది, లాంచ్ చేయలేదు. River ఇండీతో లింక్ ఉన్నప్పటికీ, EC 06 అనేది కేవలం బ్యాడ్జ్ మాత్రమే మార్చిన స్కూటర్ కాదు. డిజైన్ నుంచి స్టోరేజ్, యూజర్ కంఫర్ట్ వరకు కొన్ని ముఖ్యమైన మార్పులను Yamaha ప్రవేశపెట్టింది. అందుకే, ఇప్పుడు ఈ రెండు స్కూటర్‌ల మధ్య ఉన్న నిజమైన తేడాలను తెలుసుకుందాం.
డిజైన్ పోలిక - ఏ బండి ఎక్కువ మోడ్రన్?
River Indie డిజైన్ పూర్తిగా యుటిలిటేరియన్ స్టైల్‌తో ఉంటుంది. దాని ట్విన్ హెడ్‌ల్యాంప్స్, రగ్గడ్ లుక్, లగ్గేజీ హుక్స్, పానియర్ స్టేస్ అన్నీ ఆకట్టుకుంటాయి. నగరాల్లో రోజువారీ ఉపయోగం కోసం కావాల్సిన ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ చేశారు.
అదే సమయంలో, Yamaha EC 06 కి మాత్రం పూర్తిగా కొత్త లుక్ వచ్చింది. ఇండీ స్కూటర్‌పై ఉన్న ట్విన్ హెడ్‌ల్యాంప్స్ పోయాయి, దీనికి బదులుగా నిలువుగా పేర్చిన హెడ్‌ల్యాంప్స్‌ను యమహా ఇచ్చింది. టెయిల్ ల్యాంప్ కూడా కొత్త డిజైన్‌లో ఉంది. ఇండీ మోడల్‌లా కింద కాకుండా, EC 06 స్కూటర్ LED ఇండికేటర్లు హెడ్‌ల్యాంప్ పై భాగంలో పెట్టారు. ఈ మార్పులతో EC 06 స్కూటర్ మరింత క్లీన్‌గా, మోడర్న్‌గా, యంగ్ రైడర్లను ఆకర్షించేలా కనిపిస్తుంది.
స్టోరేజ్ పోలిక: ఈ విషయంలో ఇండీనే విజేత
స్కూటర్ మొత్తం స్టోరేజ్‌లో River Indie క్లియర్ విన్నర్. River Indie లో 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ + 12 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ ఉంది. Yamaha EC 06 లో కేవలం 24.5 లీటర్ల స్టోరేజ్ అందుబాటులో ఉంది, ముందు భాగంలో స్టోరేజ్ ఇవ్వలేదు. ఆ స్పేస్‌ను ఛార్జింగ్ పోర్ట్, కీ స్లాట్ కోసం వాడారు. అందుకే రోజూ ఆఫీసు బ్యాగ్ లేదా ఏవైనా బ్యాగ్స్ పెట్టుకోవాలంటే ఇండీ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఛార్జింగ్ టైమ్ పోలిక
River Indie: 480W ఛార్జర్‌తో 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Yamaha EC 06: 9 గంటలు (ఛార్జింగ్ స్పీడ్ డిటైల్ ఇవ్వలేదు)
ఇక్కడ కూడా ఇండీ స్కూటర్ కొంచెం ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది.
ధర పోలిక (అంచనా)
Yamaha EC 06 లాంచ్ కాలేదు కాబట్టి ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, River Indie తెలుగు రాష్ట్రాల్లో ₹1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్). EC 06 స్కూటర్‌ను, ఇండీ ప్లాట్‌ఫామ్‌పైనే తయారు చేస్తుండడంతో దాని ధర కూడా ఇండీకి సమానంగా లేదా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం... EC 06 పూర్తిగా River Hoskote ఫ్యాక్టరీలోనే తయారవుతోంది.
ఎవరికి ఏ స్కూటర్ బెస్ట్?
డిజైన్ & స్టైల్: Yamaha EC 06
స్టోరేజ్ & ప్రాక్టికాలిటీ: River Indie
ఛార్జింగ్ టైమ్: River Indie
బ్రాండ్ నమ్మకం: Yamaha EC 06
స్టైలిష్, మోడర్న్ లుక్ కావాలంటే EC 06 బెస్ట్. కానీ ఎక్కువ స్టోరేజ్, ప్రాక్టికల్ యూజ్ కావాలంటే River Indie క్లియర్ విన్నర్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















