Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sabarimala News: శబరిమల అయ్యప్ప భక్తులకు ద.మ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా జనవరి 34 అదనపు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది.
SCR Additional Special Trains To Sabarimala From AP And Telangana: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. తాజాగా మరిన్ని అదనపు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఆదివారం ప్రకటించింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1 వరకూ 34 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ - కొట్టాయం, కొట్టాయం - సికింద్రాబాద్, మౌలాలి - కొట్టాయం, కాచిగూడ - కొట్టాయం, మౌలాలి - కొల్లం మధ్య జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ ప్రత్యేక సర్వీసులు సేవలందించనున్నాయి.
ఆ రూట్లు ఇవే..
SCR to run 34 Additional Services for #Sabarimala Pilgrims pic.twitter.com/PUfCodTsn8
— South Central Railway (@SCRailwayIndia) December 8, 2024
- హైదరాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (07065/07066) మొత్తంగా 8 సర్వీసులు మంగళ, బుధవారాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లు బేగంపేట, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూరు, సేలం, సులేహల్లి, యాద్గిర్, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలర్ పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, కోయంబత్తుర్, పాలక్కడ్, త్రిశ్సూర్, అలువ, ఎర్నాకుళం టౌన్ స్టేషన్ల మీదుగా నడవనున్నాయి.
- మౌలాలి - కొట్టాయం - సికింద్రాబాద్ (07167/07168) ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్ పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, కోయంబత్తుర్, పాలక్కడ్, త్రిశ్సూర్, అలువ, ఎర్నాకుళం టౌన్ స్టేషన్ల మీదుగా శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగించనున్నాయి.
- మాలాలి - కొల్లం - మాలాలి (07170/07172) ప్రత్యేక రైళ్లు శని, సోమవారాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ సర్వీసులు భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్ పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, పొడన్నూరు, పాలక్కాడ్, త్రిశ్సూర్, అలవు, ఎర్నాకుళం, ఎట్టుమానూర్, కొట్టాయం, చెంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
- కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ (07169/07170) ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్ పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పుర్, కోయంబత్తుర్, పాలక్కడ్, త్రిశ్సూర్, అలువ, ఎర్నాకుళం టౌన్ స్టేషన్ల మీదుగా ఆది, సోమవారాల్లో నడవనున్నాయి. ఈ రైళ్లల్లో ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు సైతం ఉంటాయని ద.మ.రైల్వే అధికారులు తెలిపారు.
కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి 92 ప్రత్యేక రైళ్లను ద.మ.రైల్వే నడుపుతోంది. మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపూర్ నుంచి కొల్లం వరకూ ఈ రైళ్లు నడపనున్నారు.