నభా నటేష్ ఇస్మార్ట్ హీరోయిన్! కుర్రకారు మనసు దోచేలా స్టైలిష్ ఫోటోషూట్ చేశారు. మీరూ ఆ ఫోటోలను చూడండి. ఇస్మార్ట్ పిల్లగా, రామ్ జోడీగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' నభాకు తెలుగులో పెద్ద హిట్. 'ఇస్మార్ట్ శంకర్'కు ముందు సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే'తో తెలుగు తెరకు నభా పరిచయం అయ్యారు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రవితేజ 'డిస్కో రాజా', సాయి తేజ్ 'సోలో బతుకే సో బెటర్' చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్', నితిన్ 'మేస్ట్రో' సినిమాల్లోనూ నభా నటేష్ నటించారు. ప్రస్తుతం సినిమాలకు నభా నటేష్ చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆ మధ్య నభా నటేష్ కాలికి చిన్న గాయమైంది. అందువల్ల, నటనకు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. ఇప్పుడు నభా నటేష్ మళ్ళీ ఫోటోషూట్లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నభా నటేష్ (All Images Courtesy : nabhanatesh / Instagram)