Sonia Akula Engagement: ఎంగేజ్మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Bigg Boss 8 Sonia Engagement: టాలీవుడ్ హీరోయిన్, రీసెంట్ 'బిగ్ బాస్ 8' తెలుగు ఫేమ్ సోనియా ఆకుల నిశ్చితార్థం చేసుకుంది. ఆమెకు కాబోయే భర్త ఎవరో తెలుసా?

Sonia Akula Engagement News: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కథానాయిక మెడలో మూడు ముళ్ళు వేయించుకోవడానికి రెడీ అవుతోంది. మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్త ఇటీవల హల్ చల్ చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ భామ సోనియా ఆకుల వంతు వచ్చింది. తన పెళ్లి విషయాన్ని ఆవిడ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
నిశ్చితార్థం చేసుకున్న సోనియా ఆకుల
తనకు నిశ్చితార్థం జరిగినట్టు సోనియా ఆకుల సోషల్ మీడియాలో చెప్పారు. ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలతో పాటు, తనకు కాబోయే భర్తను కూడా నెటిజనులకు పరిచయం చేశారు. యష్ వీరగోనితో జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించినట్టు ఆవిడ వివరించారు. గురువారం సోనియా ఎంగేజ్‌మెంట్ జరిగిందని తెలుస్తోంది. ఫోటోలు నెట్టింట్ లీక్ అయ్యాయి కూడా. అయితే... శనివారం రాత్రి సోనియా అఫీషియల్‌గా ఆ గుడ్ న్యూస్ చెప్పారు.
''నేను జీవితాంతం ఉండబోయే ఇల్లు నాకు దొరికింది. నీలో నాకు నా స్వార్థం కనిపించింది. ఎటువంటి సాహసోపేత ప్రయాణమైన సరే నీతో కలిసి వెళితే శ్రమ ఉండదు. మన ఇద్దరం కలిసి జీవితంలో ముందుకు వెళదాం'' అని సోనియా ఆకుల యష్ సోషల్ మీడియాలో తమ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే షోస్ క్యాన్సిల్, కలెక్షన్స్ అయితే మరీ ఘోరం
View this post on Instagram
బిగ్ బాస్ ఇంటిలో ఉన్నది 28 రోజులే అయినా...
'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 8లో సోనియా ఆకుల పార్టిసిపేట్ చేశారు. ఆ ఇంటిలో ఆవిడ ఉన్నది 28 రోజులే. నాలుగో వారంలో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఆ నాలుగు వారాలలో ఆవిడ టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. బిగ్ బాస్ ఇంటిలో ఆర్టిస్టులు నిఖిల్, పృథ్వీలను ఆట బొమ్మలు చేసి ఆడుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఒక దశలో నిఖిల్ సోనియా మధ్య ప్రేమ చిగురించిందని కూడా కొందరు భావించారు. నిఖిల్ ఇంటి నుంచి బయటకు వచ్చేలోపు ఆవిడ నిశ్చితార్థం చేసుకున్నారు. సోనియా ఆకుల నిశ్చితార్థం చేసుకోవడంతో పలువురు సెలబ్రిటీలు, సాధారణ ప్రేక్షకులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Also Read: రేవంత్ రెడ్డి పాలనలో కేసీఆర్‌ను పొగిడితే ఎలా... రాంగ్ స్టెప్ వేసిన 'జబర్దస్త్' రాకేష్
రామ్ గోపాల్ వర్మ సినిమాతో గుర్తింపు!
తెలంగాణలోని ఒకప్పటి కరీంనగర్ ఇప్పటి పెద్దపల్లి జిల్లాలోని మంతని సోనియా స్వస్థలం. రైతు కుటుంబంలో జన్మించిన ఆవిడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అలాగే లా కూడా కంప్లీట్ చేశారు. కానీ ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి. 'జార్జ్ రెడ్డి' సినిమాలో హీరో సిస్టర్ రోల్ చేయడంతో పాటు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఆశా ఎన్కౌంటర్' (దిశా ఎన్కౌంటర్ బేస్ చేసుకుని తీసిన) సినిమాలో నటించడం ద్వారా సోనియా ఆకుల గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే, కరోనా వైరస్ సినిమాలోనూ ఆవిడ నటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

