Parineeti Chopra’s Wedding: రాజస్థాన్ లో పరిణీతి రాయల్ వెడ్డింగ్- పెళ్లికి ముందు ఇన్ని ప్రేమకథలా?
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకోబోతోంది. ఈనెల 24న ఉదయ్ పూర్ లో ఈ వివాహం జరగనుంది. అయితే, పెళ్లికి ముందు పరిణీతి పలువురితో ప్రేమాయణం నడిపిందట!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. దశాబ్దకాలంగా సినిమా పరిశ్రమలో కొనసాగుతోంది. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించింది. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా మూడు ముళ్లబంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకోబోతోంది. సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఇద్దరూ ఒక్కటికాబోతున్నారు. ఏడు అడుగులు నడిచి వైవాహిక జీవితానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే, రాఘవ్ చద్దాతో ప్రేమ వ్యవహారానికి ముందు, పరిణీతి చోప్రా పలువురితో ప్రేమాయణం నడిపినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
1.అర్జున్ కపూర్
పరిణీతి చోప్రా 2011లో 'లేడీస్ Vs రికీ బహల్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అర్జున్ కపూర్ తో కలిసి ‘ఇష్క్ జాదే’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ పట్ల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కొంతకాలం డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై అర్జున్, పరిణీతి స్పందించలేదు.
2.మనీష్ శర్మ
దర్శకుడు మనీష్ శర్మతో కూడా పరిణీతి చోప్రా ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ‘శుద్ధ దేశీ రొమాన్స్’ తో పాటు ‘లేడీస్ Vs రికీ బహల్’ సినిమాలు చేశారు. తరుచుగా పార్టీలు, పబ్బులకు వెళ్తూ మీడియాకు కనిపించారు. అయితే, కొంత కాలం తర్వాత వీరిద్దరూ దూరం అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది.
3.చరిత్ దేశాయ్
సినీ మేకర్ చరిత్ దేశాయ్ తో కలిసి పరిణీతి చోప్రా తొలిసారి ప్రియాంక చోప్రా ప్రీ వెడ్డింగ్ బాష్‌లో కనిపించారు. అప్పటికే వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొంతకాలం పాటు ఇద్దరు హ్యాపీగానే గడిపారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు తెలిసింది.
4.హార్డీ సంధు
పరిణీతి, హార్డీ సంధు కలిసి 'కోడ్ నేమ్ తిరంగ' చిత్రంలో నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌లో కూడా కనిపించారు. అయితే, ఈ డేటింగ్ రూమర్స్ పై ఇద్దరూ స్పందించలేదు.
5.ఉదయ్ చోప్రా
2012లో, ఉదయ్ చోప్రాతో పరిణీతి ప్రేమలో పడిందని పుకార్లు వచ్చాయి. ‘ఇష్క్ జాదే‘ ప్రీ ప్రొడక్షన్ పనుల సందర్భంగా వీరద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు వినిపించాయి. తరుచుగా ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించారు. అయితే, తాము మంచి స్నేహితులు మాత్రమే అని పలుమార్లు వెల్లడించారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని తేల్చి చెప్పారు.
6.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
పరిణీతి, సుశాంత్ రాజ్ పుత్ తో కలిసి ‘శుద్ధ్ దేశీ రొమాన్స్‘ అనే సినిమా చేసింది. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడింది. ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పరిణీతి ఆ వార్తలను ఖండించింది.
Read Also: ఊరమాస్ డైరెక్టర్ తో సూర్య మూవీ ఫిక్స్-షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial