అన్వేషించండి

UGC: ఏడాదంతా చదువుకోవచ్చు- ఉన్నత విద్యలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం

UGC: యూజీసీ (యూజీ, పీజీ డిగ్రీ కోర్సుల) రెగ్యులేషన్స్ - 2024’ సవరణ బిల్లులో కీలక ప్రతిపాదనలను యూజీసీ సిద్ధం చేసింది. కేంద్రం గెజిట్‌ను విడుదల చేసిన తర్వాత నిబంధనలన్నీ అమల్లోకి వస్తాయి.

Draft UGC on UG, PG Admissions: ఉన్నత విద్యకు మరింత మెరుగులు దిద్దేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) శ్రీకారం చుట్టింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు, విద్యా సంవత్సరాలకు సంబంధించి విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చేందుకు యూజీసీ సమాయత్తమవుతోంది. ‘యూజీసీ (యూజీ, పీజీ డిగ్రీ కోర్సుల) రెగ్యులేషన్స్ - 2024’ సవరణ బిల్లులో ఇందుకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సంబంధిత పరీక్షలో పాసయ్యే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కోర్సులో చేరొచ్చనే నిబంధన ముసాయిదా బిల్లులో ఉందని తెలుస్తోంది. అమెరికా విద్యావ్యవస్థ తరహాలో ఏడాదిలో రెండుసార్లు (జులై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరి) డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల వ్యవధిని పెంచడం, తగ్గించడం వంటి నిబంధనలు కూడా ముసాయిదాలో పొందుపరిచారు. సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసిన తర్వాత అందులోని నిబంధనలన్నీ అమల్లోకి వస్తాయి.

సవరణ బిల్లులో విప్లవాత్మక ప్రతిపాదనలు.. 
ఈ కొత్త నిబంధనలు చాలావరకు విదేశీ వర్సిటీల విద్యా విధానాలను పోలి ఉన్నాయి. విద్యార్థులు 12వ తరగతి లేదా ఇంటర్‌, డిగ్రీలో ఏ సబ్జెక్టు అనేది సంబంధం లేకుండా డిగ్రీ, పీజీ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో లేదా వర్సిటీ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులకు తరగతి గది అంశాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ సంస్కరణల ద్వారా దేశ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలను చేరుకునేలా చేస్తామని యూజీసీ చైర్‌పర్సన్‌ జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

'స్కిల్' సబ్జెక్టులకు 50 శాతం క్రెడిట్లు..
యూనివర్సిటీల్లో క్రెడిట్ల కేటాయింపు విధానంలోనూ మార్పులు చేశారు. ఇక నుంచి 50 శాతం క్రెడిట్లను ప్రధాన సబ్జెక్టులకు కేటాయిస్తారు. మిగతా 50 శాతం క్రెడిట్లను నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అప్రెంటిస్‌షిప్‌, ఇతర ఆసక్తి ఉన్న సబ్జెక్టుల నుంచి పొందవచ్చు. అదేవిధంగా ఒకేసారి రెండు డిగ్రీ లేదా పీజీ కోర్సులను చదివే అవకాశం ఉంటుంది. డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించుకునేందుకు లేదా పెంచుకునేందుకు వీలు ఉంటుంది. ఇందుకోసం యాక్సెలరేటెడ్‌ డిగ్రీ ప్రోగ్రాం(ఏడీపీ), ఎక్స్‌టెండెడ్‌ డిగ్రీ ప్రోగ్రాం(ఈడీపీ) విధానాలను ప్రవేశపెట్టనున్నారు.

ఆరు 'కేంద్ర' వర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు..
యూజీ, పీజీ కోర్సుల్లో ఇకపై ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించాలని దేశంలోని ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. వీటిలో సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌ యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించడానికి యూజీసీ నిర్ణయించడంతో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా యూనివర్సిటీల్లో ప్రతి ఏడాది జూలై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరి నెలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

రెండున్నరేళ్లలో డిగ్రీని పూర్తిచేసే వెసులుబాటు..
మూడేళ్ల డిగ్రీ కోర్సును రెండున్నర, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సును మూడు సంవత్సరాల్లో పూర్తిచేయవచ్చు. ఇందుకోసం ఒకటి లేదా రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక.. యాక్సిలేటరీ డిగ్రీ ప్రోగ్రాం (ఏడీపీ)ను ఎంచుకోవచ్చు. 10 శాతం సీట్లకే ఈ అవకాశం లభిస్తుంది. 

Public Notice

Draft UGC (Minimum Standards of Instruction for the Grant of UG and PG Degree) Regulations, 2024

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget