CTET answer key 2024: సీటెట్ 2024 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం
CTET Answer Key 2024: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జులై-2024 ఆన్సర్ కీని సీబీఎస్‌ఈ జులై 24న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జులై 27 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది.
CBSC CTET answer key 2024 released: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జులై-2024 సెషన్ ఆన్సర్ కీని సీబీఎస్‌ఈ జులై 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల OMR రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు జులై 26న రాత్రి 11.59 గంటల వరకు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు జులై 24 నుంచి జులై 24న రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా ఏమైనా అభ్యంతరాలుంటే నమోదుచేయవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలో ఏటా రెండుసార్లు సీటెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీటెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ 6వ తరగతి నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్సర్ కీ ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్-1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. - https://ctet.nic.in/
స్టెప్-2: అక్కడ హోంపేజీలో LATEST NEWS విభాగంలో కనిపించే ఆప్షన్‌లో లాగిన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: అక్కడ కనిపించే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
స్టెప్-4: తర్వాత సైన్ ఇన్ పై క్లిక్ చేసి.. ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్-5: మెయిన్ వెబ్‌సైట్‌లో స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రాథమిక కీ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్-6: ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింక్ ద్వారా తెలియజేయాలి.
ఆన్సర్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల నమోదుకు క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
సీటెట్ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి.