ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన డెలివరీ బాయ్
Noida Crime: నోయిడాలో ఓ డెలివరీ బాయ్ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేశాడు.
Noida Crime News:
డెలివరీ బాయ్ అత్యాచారం..
నోయిడాలో ఓ డెలివరీ బాయ్ మహిళపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. గ్రాసరీస్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. గ్రేటర్ నోయిడాలోని హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మహిళ యాప్‌లో గ్రాసరీస్ ఆర్డర్ పెట్టింది. నిందితుడు సుమిత్ సింగ్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చాడు. మహిళ ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. వెంటనే ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ తరవాత మహిళపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ 27న ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. గ్రేటర్ నోయిడాలోనే ఓ ఇంట్లో దాక్కున్న నిందితుడుని పట్టుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో నిందితుడు ఓ పోలీస్ వద్ద నుంచి గన్ లాక్కుని అక్కడి నుంచి పారిపోయాడు. స్వాట్ టీమ్స్ రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నాయి. గన్ లాక్కోవడమే కాకుండా పోలీసులపై కాల్పుడు జరిపాడు సుమిత్ సింగ్. పోలీసులు ఎదురు కాల్పులు జరపడం వల్ల నిందితుడి కాలికి గాయమైంది. చివరకు అన్ని చోట్లా వెతికి అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ అక్రమంగా లిక్కర్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అత్యాచార కేసులో పట్టుబడ్డాడు.
మధ్యప్రదేశ్‌లో దారుణం..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో ఇటీవలే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక రోడ్డుపై అర్ధనగ్నంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు అక్కడి CC కెమెరాలో రికార్డ్ అవడం సంచలనమైంది. చాలా దారుణమైన స్థితిలో ఉన్న ఆ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ సాయం కోసం అభ్యర్థించడం కలిచివేసింది. ఆమెను అలాంటి స్థితిలో చూసినా ఎవరూ సాయం చేయలేదు. ఓ వ్యక్తి ఆమెని చూసి కూడా పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్లిపోవడం CC కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఉజ్జెయిన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నాగర్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. తన ఒంటిని కప్పుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయింది. చివరకు ఓ ఆశ్రమం వద్దకు చేరుకుంది. ఆమెని చూసిన ఓ పూజారి వెంటనే ఆమె శరీరాన్ని కప్పాడు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు ధ్రువీకరించారు. ఈ కేసులో ఓ ఆటోడ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. ఆ ఆటోలో రక్తపు మరకలు కనిపించడాన్ని చూసి ఆరా తీశారు. ఆ తరవాత అదుపులోకి తీసుకున్నారు. జీవన్ ఖేరి అనే ఓ ఏరియా వద్ద బాధితురాలు ఇదే ఆటోని ఎక్కినట్టు CC కెమెరాలో రికార్డ్ అయిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఫుటేజ్ ఆధారంగానే ఆటో డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు.
Also Read: Kochi Blast: కేరళ పేలుడు ఘటనపై ఎన్ఎస్ జీ బృందం దర్యాప్తు - ఉగ్ర దాడి అనుమానాలపై విచారణ