SSMB29: రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
Priyanka Chopra: రాజమౌళి, మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ 'SSMB29'లో ప్రియాంక చోప్రా నటించడంపై ఆమె తల్లి మధు చోప్రా ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ప్రియాంక సినిమా షూటింగ్ చేస్తోందని చెప్పారు.

Priyanka Chopra Mother Confirms Her Casting In SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా హైప్ మామూలుగా ఉండదు. అయితే, ఇప్పటివరకూ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అండ్ టీం అప్రమత్తంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్నారన్న ఒక్క విషయం తప్ప ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నారని కూడా మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అయితే, ప్రియాంక ఈ సినిమాలో నటిస్తున్నారని.. మూవీలో ఆమె నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారనే వార్తలు సోషల్ మీడియా ద్వారానే వైరల్ అయ్యాయి. తాజాగా, ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా అదిరే హింట్ ఇచ్చారు.
క్లారిటీ ఇచ్చేసినట్టేనా..!
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మధు చోప్రా.. 'SSMB29'పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'అవును, ప్రియాంక ప్రస్తుతం సినిమా షూటింగ్ చేస్తోంది.' అని అన్నారు. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహానికి ముంబై వెళ్లిన ఆమె ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చారు. దీంతో ఆమె రాజమౌళి, మహేష్ మూవీ షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చినట్లు అంతా అనుకున్నారు. తాజాగా.. ప్రియాంక తల్లి సైతం వాటిని నిర్థారించారు. అంతకు ముందు హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకుని.. 'బాలాజీ ఆశీర్వాదంతో కొత్త అధ్యాయం మొదలుపెడుతున్నా' అంటూ కామెంట్ చేయడం సైతం.. ఈ ప్రాజెక్టులో ఆమె నటిస్తున్నారనేది హింట్ ఇచ్చినట్లేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: ఆరేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి ధనుష్ హాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
క్రేజీ న్యూస్.. నెట్టింట హల్చల్
'SSMB29' ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి లీక్స్ లేకుండా మూవీ టీం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. దర్శక, నిర్మాతల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఎవరైనా సమాచారం లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్స్ తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ మూవీపై ఇప్పటివరకూ నెట్టింట వచ్చిన క్రేజీ న్యూస్, రూమర్స్ తప్ప ఎలాంటి అధికారిక ప్రకటనలు, లీకులు రాలేదు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నెట్టింట ఏ చిన్న వార్త వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది రాజమౌళి సినిమా కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ప్రియాంక చోప్రా రోల్ విషయానికొస్తే ఆమె నెగిటివ్ రోల్‌లో చేస్తున్నారని.. హీరోతో పాటు ఆమె పాత్రకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా.. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా మూవీ రూపొందుతోందని తెలుస్తోంది.






















