Sandeep Reddy Vanga: 'హీరో లేకుండానే సినిమా తీస్తా' - చేసి చూపించాడంటూ విమర్శకులు మాట్లాడతారన్న 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి
Sandeep Reddy Vanga Future Film: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్తులో హీరో లేకుండానే సినిమా తీస్తానని చెప్పారు.

Sandeep Reddy Vanga Said That His Future Film Making Without Hero: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. దర్శకుడిగా తన ఫస్ట్ మూవీతోనే అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన తెరకెక్కించిన 'యానిమల్' (Animal) మూవీపై కొందరు ప్రముఖులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సందీప్ వంగా సినిమాల్లో ఎక్కువగా హీరోలు మాస్ క్యారెక్టర్లలో ఫవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తుంటారు. అయితే, తాను భవిష్యత్తులో హీరో లేకుండానే సినిమా చేస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సినిమాలపై వస్తోన్న విమర్శలపై ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తాను హీరో లేకుండానే సినిమా చేస్తానని చెప్పారు.
'మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా.? లేదా.. హీరో లేకుండా సినిమాలు తీస్తారా..? ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోండి.' అనే ప్రశ్న ఎదురు కాగా.. 'హీరో లేకుండా సినిమా తీయాలనేది నా ఆలోచనగా ఉంది. ఒకవేళ అలాంటి సినిమాలు తీస్తే.. నా చిత్రాలను విమర్శించిన మహిళలు కూడా దాన్ని ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4, 5 ఏళ్లల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా అప్పుడు 'ఐదేళ్ల క్రితం సందీప్ చెప్పింది చేసి చూపించాడు' అని చర్చించుకుంటారు.' అని సందీప్ తెలిపారు.
Also Read: రాజమౌళి, మహేశ్ 'SSMB29' మూవీలో మలయాళ స్టార్ - ఆ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లేనా?
'ఫిల్మ్ మేకింగ్ కంటే ఐఏఎస్ కావడం ఈజీ'
ఇదే సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్‌గా మారాయి. 'యానిమల్' మూవీపై ఓ మాజీ ఐఏఎస్ చేసిన కామెంట్స్‌పై ఆయన స్పందిస్తూ.. కష్టపడి పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావొచ్చని.. కానీ, సినిమా తీయాలంటే ఎలాంటి కోర్సులు లేవని అన్నారు. 'యానిమల్ వంటి సినిమాలు అస్సలు తెరకెక్కించకూడదన్న ఆ మాజీ ఐఏఎస్ అధికారి అభిప్రాయం.. ఈ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఆయన కామెంట్స్ నన్నెంతో బాధించాయి. నేను ఏదో నేరం చేశాననిపించింది. ఆయన అనవసరంగా నా సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారనిపిస్తోంది. ఆ టైంలో నేను ఒక్కటే అర్థం చేసుకున్నా. ఢిల్లీ వెళ్లి ఏదైనా ఓ సంస్థలో చేరి కష్టపడి చదివితే ఐఏఎస్ కావొచ్చు. కానీ ఫిల్మ్ మేకర్, రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. నీకు నువ్వుగా ఇష్టంతో అన్నీ నేర్చుకుంటూ ముందుకు సాగాలి. ఈ విషయాన్ని నేను పేపర్‌పైనా రాసిస్తాను.' అని సందీప్ పేర్కొన్నారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ 'స్పిరిట్' మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కలెక్షన్లు 'బాహుబలి'ని దాటాలని లేదని.. రూ.2 వేల కోట్లు అనేది చాలా పెద్ద విషయమని అన్నారు. ఇది చాలా మంచి సినిమా అని ఎంత కలెక్షన్లు రాబడుతుంది అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.
Also Read: ఆరేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి ధనుష్ హాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?





















