అన్వేషించండి

SSMB29: రాజమౌళి, మహేశ్ 'SSMB29' మూవీలో మలయాళ స్టార్ - ఆ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లేనా?

Prithviraj Sukumaran: రాజమౌళి, మహేశ్ బాబు కాంబో మూవీ 'SSMB29' గురించి మరోసారి నెట్టింట చర్చ సాగుతోంది. ఈ మూవీలో ఓ మలయాళ స్టార్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Prithviraj Sukumaran's Post Viral On 'SSMB29' Project: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) కాంబోలో 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తెరకెక్కుతుండగా.. ఇప్పటివరకూ ఈ సినిమా గురించి నెట్టింట రూమర్స్ తప్ప ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఎలాంటి లీకులు లేకుండా దర్శకుడు రాజమౌళి అండ్ టీం అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. నటీనటులు, స్టోరీల విషయంలో ఊహాగానాలే తప్ప ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ మూవీపై ఏ చిన్న రూమర్స్ కానీ వార్త కానీ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా.. మరోసారి ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది రాజమౌళి మహేశ్ సినిమా కోసమేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Also Read: టాలీవుడ్ మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ - ఏ సినిమాలో నటించారో తెలుసా?

ఆయన ఏం పోస్ట్ చేశారంటే..?

రాజమౌళి, మహేశ్ ప్రాజెక్టులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన తన 'ఇన్‌స్టా' పేజీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'ఓ దర్శకుడిగా నా చేతిలో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి చేశాను. వీటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. నటుడిగా తెరపై కనిపించేందుకు సిద్ధపడుతున్నా. పరభాష చిత్రంలో కనిపించబోతున్నా. ఆ మూవీలో పెద్ద డైలాగ్స్ ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఇది 'SSMB29' ప్రాజెక్టు కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీని కోసమే పృథ్వీరాజ్ తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో తాను మహేశ్ - రాజమౌళి సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన రూమర్లపై స్పందించారు. 'నాకంటే మీడియా, నెటిజన్లకే ఎక్కువ విషయాలు తెలిశాయి. ఇంకా దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందాం.' అని తెలిపారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prithviraj Sukumaran (@therealprithvi)

'SSMB29' ప్రాజెక్ట్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా.. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు న్యూ లుక్‌లో కనిపించనుండగా.. ఇటీవల ఆయన జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రియాంకచోప్రా ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోతో పాటు ఆమె రోల్‌కు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

Also Read: సామాన్యురాలి నుంచి సీఎంగా ఎదిగిన మహిళ స్టోరీ - సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మహారాణి' సీజన్ 4 వచ్చేస్తోంది, టీజర్ చూశారా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?

వీడియోలు

Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget