ప్రియాంక చోప్రా రెండు దశాబ్ధాలకు పైగా హీరోయిన్​గా కొనసాగుతుంది. ఇప్పటికీ తన గ్లామర్​తో అద్భుతమైన పాత్రలు దక్కించుకుంటుంది.

తాజాగా రాజమౌళి, మహేశ్ కాంబినేషన్​లో వస్తోన్న సినిమాలో హీరోయిన్​గా ఫిక్స్ కూడా అయింది.

40 ఏళ్లు దాటినా.. తన అందాన్ని కాపాడుకోవడంలో సహజమైన పద్ధతులను ఎక్కువగా ఫాలో అవుతుంది ప్రియాంక.

రాత్రుళ్లు రాగి గ్లాస్​లో నీళ్లు పోసి ఉదయాన్నే దానిని తాగుతుందట. స్కిన్ బెనిఫిట్స్​తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చట.

పడుకునేప్పుడు స్కిన్​పై ఎలాంటి మేకప్ ప్రొడెక్ట్స్ లేకుండా చూసుకుంటుందట. దీనివల్ల స్కిన్​ హెల్తీగా ఉంటుందని చెప్తుంది.

నెలకు రెండుసార్లు కచ్చితంగా ఫేషియల్ చేయిస్తుందట ప్రియాంక. ఇది స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుందని చెప్తుంది.

అలాగే హైడ్రేటెడ్​గా ఉండేందుకు ఎక్కువ నీటిని తాగుతానని.. ఇది స్కిన్​కి చాలా మంచిదంటోంది.

కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకుంటానని.. ఇది స్కిన్​ హెల్త్​కి మేలు చేస్తుందని చెప్తుంది ప్రియాంక.

ముఖానికి శనగపిండి, పెరుగు, తేనె వేసి పేస్ట్​గా చేసి.. స్కిన్​ని ఎక్స్​ఫోలియేట్ చేసేందుకు ఉపయోగిస్తుందట.

స్కిన్ ఎలా ఉన్నా.. మనం కాన్ఫిడెంట్​గా ఉంటే ఆ గ్లో వేరే ఉంటుందని చెప్తుంది ఈ భామ.