News
News
వీడియోలు ఆటలు
X

Chittoor News : గంగమ్మ జాతరలో పవన్ కల్యాణ్ వర్సెస్ ఎన్టీఆర్, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన గ్రామస్తులు

Chittoor News : గంగమ్మ జాతరలో సినీ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన నటుడి పాటకే డ్యాన్స్ చేయాలంటూ ఆర్కేస్ట్రా నిర్వకులను ఒత్తిడి చేశారు. పవన్ కల్యాణ్ పాట వేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

FOLLOW US: 
Share:

Chittoor News : సాధారణంగా పండుగలు అంటే అందరూ గ్రామాల వైపే చూస్తారు. అందరూ కలిసి ఒకే‌ కుటుంబంగా గ్రామాల్లో పండుగలను జరుపుకుంటూ ఉంటారు. ఏ ప్రాంతంలో ఉన్నా తమ గ్రామంలో ఏడాది‌కొక్కసారి‌ జరిగే పండుగకు కచ్చితంగా హాజరై అందరితో కలిసి పండుగను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి కొందరు ఆకతాయి చేసే పనుల కారణంగా గ్రామస్తులు అంతా ఇబ్బందులకు గురి అవుతుంటారు. తాజాగా పండుగ రోజున ఆర్కేస్ట్రా పెట్టుకుని గ్రామస్తులు అంతా ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ గ్రామంలో కొందరు ఆకతాయిలు చేసిన పనికి గ్రామస్తులు అంతా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. 

అసలేం జరిగింది. 

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో ఏళ్ల తరబడి గంగమ్మ జాతరను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. బయట ప్రాంతాల్లో  స్థిరపడిన గ్రామస్తులు కూడా గంగమ్మ జాతరకు సొంత గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా గ్రామంలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు అంతా తీర్మానం చేసుకుని, చందాలు వేసుకుని జాతరకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలోని కొందరు యువకుల కోరిక మేరకు ఈ ఏడాది ఆర్కేస్ట్రా పెట్టాలని భావించిన గ్రామస్తులు అనుకున్న విధంగా శనివారం గ్రామంలోని ఏడు ప్రాంతాల్లో వెలసిన గంగమ్మ ఆలయాలు ఉండగా, అందులో నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు, వినోద కార్యక్రమం అనంతరం మరో మూడు ఆలయాల్లో పొంగళ్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంది. గంగమ్మ జాతరలో‌ భాగంగా శనివారం రాత్రి గ్రామం నడిబొడ్డులో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు.

గబ్బర్ సింగ్ సాంగ్ కు డాన్స్ తో 

బయట ప్రాంతం నుంచి విచ్చేసిన ఆర్కేస్ట్రా సభ్యులు గ్రామస్తులు కోరిన సినిమా పాటకు డ్యాన్స్ లు చేశారు. అంతవరకూ సాఫీగా సాగిన ఆర్కేస్ట్రాలో ఒక్కసారిగా గొడవ మొదలైంది. గ్రామంలోని కొందరు ఎన్టీఆర్ పాటలు అని మరి కొందరు పవన్ కల్యాణ్ పాటలు అలా కాదు ప్రభాస్ పాటలు వేయాలని ఆర్కేస్ట్రా దారులను ఇబ్బంది పెట్టసాగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ పాటకు డాన్స్ వేశారు ఆర్కేస్ట్రా సభ్యులు. దీంతో ఆగ్రహించిన కొందరు యువకులు ఆర్కేస్ట్రా నిర్వాహకులతో గొడవకు దిగ్గి కుర్చీలను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో‌ ఘర్షణ వాతావరణం నెలకొంది. యువకులు ఒకరిపై ఒకరు దాడులకు‌ దిగడంతో గ్రామస్తులు పోలీసులకు‌ సమాచారం అందించారు.‌ దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఊరందరినీ పోలీస్ స్టేషనుకు తరలించారు. రాత్రి అంతా స్టేషన్ వద్దే ఉండి గ్రామస్తులు పంచాయితీ జరపడంతో గంగమ్మ జాతరకు బ్రేకులు పడ్డాయి. మరో‌ మూడు ప్రాంతాల్లో వెలసిన గంగమ్మకు పెట్టాల్సిన పొంగళ్లు నిలిచిపోయాయి. ఉదయాన్నే గ్రామానికి చేరుకున్న పోలీసులు గొడవకు గల కారణాలపై ఆరా తీసి ఐదుగురు యువకులపై కేసు నమోదు చేశారు. దీంతో గ్రామంలో పండుగ జోష్ పూర్తిగా అర్ధంతరంగా నిలిచిపోవాల్సి వచ్చింది. 

Published at : 05 Jun 2022 10:31 PM (IST) Tags: Chittoor News NTR fans Gangamma festival Gabbar singh songs Pawan kalya fans

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?