అన్వేషించండి

Diwali Business Ideas: పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ - ఈ వ్యాపారాల్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది!

Diwali 2024: ఈ దీపావళి సమయంలో పార్ట్ టైమ్ బిజినెస్‌లు చేస్తే, పండుగ సమయంలో మీకు మంచి లాభం రావడమే కాదు, మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆ తర్వాత మీరు సొంతంగా ఇతర వ్యాపారాలు కూడా చేస్తారు.

Profitable Business Ideas: ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో పెద్ద పండుగలన్నీ అక్టోబర్‌లోనే ఉన్నాయి. ఈ నెలలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ముగిశాయి - ఇక దీపావళి వంతు రాబోతోంది. ఈ పండుగ సీజన్‌లో, దేశ ప్రజలంతా షాపింగ్‌లతో బిజిబిజీగా గడుపుతున్నారు. ఫెస్టివ్‌ సీజన్‌ ముగిసేసరికి, భారతీయులంతా కలిసి రూ. 4.25 లక్షల కోట్ల రూపాయల విలువైన షాపింగ్‌ చేస్తారని అంచనా. ఇలాంటి కలిసొచ్చే కాలంలో మీరు ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటే, ఇదొక మంచి అవకాశం.

మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది. ఈ వెలుగుల పండుగను దృష్టిలో పెట్టుకుని, చాలా  తక్కువ మూలధనంతో కొన్ని వ్యాపారాలు చేయొచ్చు. ఆ బిజినెస్‌ ఐడియాల్లో మంచి లాభాలకు పూర్తి స్కోప్ ఉంటుంది. పైగా, అవి తక్కువ కాల వ్యవధి వ్యాపారాలు. అంటే, మీ ప్రధాన పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కేవలం కొన్ని రోజుల వరకే వాటిని నిర్వహించొచ్చు, పండుగ సమయంలో లాభాలు కళ్లజూడొచ్చు. 

దీపావళి సమయంలో చేయదగిన లాభదాయక వ్యాపారాలు!

పూజ సామగ్రి 
వాస్తవానికి, పూజ సామగ్రికి దీపావళి సమయంలోనే కాదు, ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. పండుగల సమయంలో ప్రతి ఇంట్లో పూజ కార్యక్రమాలు, హోమాలు పెరుగుతాయి. కాబట్టి, ఈ టైమ్‌లో హోమ ద్రవ్యాలకు, పూజ సామగ్రికి డిమాండ్ కూడా పెరుగుతుంది. హోమంలో అగ్నిని వెలిగించేందుకు ఉపయోగించే రావిచెట్టు కర్రలు, ఇతర హోమ ద్రవ్యాలు, పూజల్లో ఉపయోగించే అగరబత్తీలు, దీపాలు, నూనెలు, వత్తులు, పూలు, కొబ్బరికాయలు వంటి వాటికి ఇప్పుడు గిరాకీ పెరుగుతుంది. కేవలం రూ.5,000 నుంచి రూ.10,000 స్వల్ప మొత్తంతో ఈ వ్యాపారాలను కొన్ని రోజుల కోసం ప్రారంభించొచ్చు. ప్రస్తుతం, పూజ ద్రవ్యాల విషయంలో పెద్ద బ్రాండ్ల ముద్ర పెద్దగా లేదు. కాబట్టి, మీరు ఎటువంటి చింత లేకుండా నిశ్చింతగా ఈ వ్యాపారాలను స్టార్ట్‌ చేయొచ్చు. ఇది మీకు కంఫర్ట్‌గా అనిపిస్తే, ఏడాది పొడవునా కంటిన్యూ చేయొచ్చు.

మట్టి ప్రమిదలు
దీపావళి రోజున ప్రతి ఇంట్లో మట్టి దీపాలు వెలిగిస్తారు. మట్టి ప్రమిదలతో పాటు డిజైనర్ దీపాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ దీపాలు చాలా చౌకగా ఉంటాయి, దీపావళి ముగిసే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరుగుతుంటాయి. మీరు ఈ బిజినెస్‌ చేయాలనుకుంటే, ప్రమిదల తయారీదార్లను సంప్రదించొచ్చు. వాళ్ల దగ్గరున్న డిజైన్లతో పాటు మీ సొంత డిజైన్‌తో, ఆకర్షణీయంగా ప్రమిదలు తాయరు చేయించొచ్చు. మట్టి ప్రమిదలను ఇప్పుడు యంత్రాల సాయంతోనూ తయారు చేస్తున్నారు. వీటిని మీరు ఆన్‌లైన్‌లో కూడా విక్రయించొచ్చు. 

విగ్రహాలు
దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడి విగ్రహాలను పూజిస్తారు. మీరు ఇలాంటి విగ్రహాలను తెప్పించుకుని, మీ ఇంటి దగ్గరే బిజినెస్‌ చేయొచ్చు.

విద్యుత్‌ దీపాలు & కొవ్వొత్తులు 
దీపావళికి రెండు, మూడు రోజుల ముందు నుంచే చాలా ఇళ్లు విద్యుత్‌ లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. వెలుగులు విరజిమ్మే రంగురంగుల లైటింగ్ సెట్లను మీరు మార్కెట్‌లో & ఆన్‌లైన్‌లో అమ్మొచ్చు. దీనికి కూడా చాలా తక్కువ పెట్టుబడి చాలు. డిజైనర్ క్యాండిల్స్‌ అమ్మకాలు కూడా జోరుగా సాగుతాయి.

బాణసంచా
బాణసంచా వెలుగులు లేని దీపావళిని ఊహించుకోలేం. పేదవాళ్లయినా, పెద్దవాళ్లయినా.. వాళ్ల తాహతుకు తగ్గట్లుగా దీపావళి టపాసులు కొంటారు. కొన్నేళ్లుగా ఎకో-ఫ్రెడ్లీ క్రాకర్స్‌ ట్రెండ్‌ కూడా నడుస్తోంది. బాణసంచా వ్యాపారానికి కాస్త పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. అయితే, ఆ మూలధనం మీపై లాభాల వర్షం కురిపిస్తుంది.

మరో ఆసక్తికర కథనం: ఈసారి మూహూరత్‌ ట్రేడింగ్‌ చేస్తారా? - తేదీ, సమయం ఎప్పుడంటే? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
New Rules From April: UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs KKR Match Highlights IPL 2025 | కేకేఆర్ ను మట్టి కరిపించిన ముంబై ఇండియన్స్ | ABP DesamDhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On HCU Lands: నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
నిన్న సామాన్యుల ఇండ్లు కూల్చేశారు, నేడు మూగజీవాలకు ఆశ్రయం లేకుండా చేస్తారా? కేటీఆర్ ఫైర్
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రోజుకో ట్విస్ట్, ఏపీ ప్రభుత్వం ఇలా.. కేంద్రం అలా..!
New Rules From April: UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
UPI నుంచి IT వరకు, గ్యాస్‌ నుంచి TDS వరకు - ఈ రోజు నుంచి మీరు ఊహించనన్ని మార్పులు
Rajiv Yuva Vikasam Scheme: యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
యువతకు గుడ్‌న్యూస్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు గడువు పొడిగింపు
Allu Arjun: అల్లు అర్జున్ పేరు మారుతుందా? న్యూమరాలజీని నమ్ముకుంటున్న ఐకాన్ స్టార్... కారణం ఇదేనా?
అల్లు అర్జున్ పేరు మారుతుందా? న్యూమరాలజీని నమ్ముకుంటున్న ఐకాన్ స్టార్... కారణం ఇదేనా?
Salman Khan: సల్మాన్ ఖాన్ హిస్టరీలో ఇదే చెత్త రికార్డా... భాయ్ సినిమా షోలు క్యాన్సిల్
సల్మాన్ ఖాన్ హిస్టరీలో ఇదే చెత్త రికార్డా... భాయ్ సినిమా షోలు క్యాన్సిల్
HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
Gas Cylinder Price Cut: రూ.45 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు - మీ నగరంలో కొత్త ధరలు ఇవీ
రూ.45 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు - మీ నగరంలో కొత్త ధరలు ఇవీ
Embed widget