అన్వేషించండి

Direct Tax collection: రూ.8.98 లక్షల కోట్లకు చేరిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు, టార్గెట్‌లో 50% ఔట్‌

వ్యక్తిగత ఆదాయపు పన్ను (సెక్యూరిటీల క్రయవిక్రయాల మీద పన్నులతో కలిపి) విభాగంలో 32 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్‌ పన్ను విభాగంలో వసూళ్లు 16.73 శాతం పెరిగాయి.

Direct Tax collection: భారత ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగుతోంది. ఒకపైపు వస్తు, సేవల పన్నుల (GST) వసూళ్లు; మరోవైపు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రేసు గుర్రాల్లా దూసుకెళ్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) ఇప్పటివరకు (2022 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబరు 8 వరకు).. కార్పొరేట్‌, వ్యక్తిగత ఆదాయ విభాగాల్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.98 లక్షల కోట్లకు చేరినట్లు పన్ను విభాగం ప్రకటించింది. 

ఇన్‌కం టాక్స్‌, టాన్స్‌ఫర్‌ టాక్సెస్‌, ఎన్‌టైటిల్‌మెంట్‌ టాక్స్‌, ప్రాపర్టీ టాక్స్‌, క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్ టాక్స్‌ (DDT) సెక్యూరిటీస్‌ ట్రాన్జాక్షన్‌ టాక్స్‌ (STT) వంటివాటిని డైరెక్ట్‌ టాక్సెస్‌ లేదా ప్రత్యక్ష పన్నులుగా మన దేశంలో వసూలు చేస్తారు.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. వ్యక్తిగత ఆదాయపు పన్ను (సెక్యూరిటీల క్రయవిక్రయాల మీద పన్నులతో కలిపి) విభాగంలో 32 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్‌ పన్ను విభాగంలో వసూళ్లు 16.73 శాతం పెరిగాయి. 

నికరంగా రూ.7.45 లక్షల కోట్లు
ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేసినవారికి సంబంధించిన రిఫండ్లను (రూ.1.53 లక్షల కోట్లు) సర్దుబాటు చేసిన తర్వాత, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబరు 8 వరకు రూ.7.45 లక్షల కోట్లుగా లెక్క తేలాయని పన్ను విభాగం వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన పన్ను వసూళ్ల లక్ష్యానికి సంబంధించి, బడ్జెట్‌ అంచనాల్లో (BE) ఇది 52.46 శాతానికి సమానం. 

2022-23లో రూ.14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22లో వసూలైన రూ.14.10 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల కంటే మరో 10 వేల కోట్ల రూపాయలను అధికంగా టార్గెట్‌గా పెట్టుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 మధ్య కాలంలో రూ.1.53 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిఫండ్‌లు జారీ అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం పెరిగింది.

రిఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16.3 శాతం ఎక్కువ. ఇందులో.. వ్యక్తిగత ఆదాయ పన్నులో 16.25 శాతం (STT సహా); కార్పొరేట్ పన్నులో 16.29 శాతం పెరుగుదల ఉంది.

వసూళ్లు పెరిగినా ఆర్థిక మందగమనం
ఏ దేశానికి సంబంధించైనా, పన్ను వసూలను ఆర్థిక కార్యకలాపాల సూచికగా చూడాలి. పన్ను వసూళ్లు పెరిగాయంటే ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని అర్ధం. మన దేశంలో, పారిశ్రామిక ఉత్పత్తి & ఎగుమతులు మందగించినప్పటికీ పన్నుల వసూళ్లు బాగా పెరిగాయి. దీనికి కారణం కార్పొరేట్ లాభాలు పెరగడం. అవే ఎకనమిక్‌ గ్రోత్‌ ఇంజిన్‌ను నడుపుతున్నాయి.

సరుకుల ఎగుమతుల్లో, గత ఏడాది కనిపించిన ఉప్పెన లాంటి ఊపు ఇప్పుడు లేదు. సెప్టెంబర్‌లో ఎగుమతులు 3.5 శాతం తగ్గాయి. మొదటి ఆరు నెలల్లో వాణిజ్య లోటు దాదాపు రెట్టింపు అయింది.

పారిశ్రామిక (Index of Industrial Production-IIP) వృద్ధి జులైలో 2.4 శాతానికి తగ్గగా, ఆగస్టులో ‘కోర్ సెక్టార్’ తొమ్మిది నెలల కనిష్ట స్థాయి 3.3 శాతానికి చేరుకుంది.

వస్తువులు, సేవలపై పన్ను (GST) వసూళ్లు నెలకు సగటున దాదాపు రూ.1.45-1.46 లక్షల కోట్లతో ఫ్లాట్‌గా ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధిని గతంలో అంచనా వేసిన 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం, విదేశాల నుంచి డిమాండ్ మందగించడం వంటి కారణాలతో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఇతర రేటింగ్ ఏజెన్సీలు కూడా తగ్గించాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Embed widget