News
News
X

ప్రధానితో సీఎం భేటీతోపాటు ఇవాళ్టి ఏపీ అప్‌డేట్స్‌ ఇవే

ప్రధాన మంత్రితో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తూనే... ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకోనున్నారని తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

నేడు ప్రధానితో సీఎం భేటీ 

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రెండురోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు . 

నెల్లూరు లో మూడురోజుల పర్యటనకు చంద్రబాబు 

టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు నెల్లూరు వెళ్లనున్నారు. ఈ రోజు సింగరాయ కొండ , కందుకూరులో రోడ్ షో ,పబ్లిక్ మీటింగ్‌ల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 31వరకూ ఆయన నెల్లూరు పర్యటనలోనే గడపనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కీలకనేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చెయ్యనున్నారు . 

తిరుమల చేరుకున్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ 

మంగళవారం నాడు ఏపీ చేరుకొన్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్ ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు ఈరోజు రేపు ఆయన తిరుమలలోనే బసచేయనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు . 

తిరుమల భక్తులకు మాస్క్ తప్పనిసరి : టీటీడీ చైర్మన్ 

కోవిడ్ వ్యాప్తి మళ్ళీ కనిపిస్తున్న నేపథ్యంలో తిరుమల భక్తులకు మాస్క్ తప్పనిసరి చేశారు టీటీడీ అధికారులు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటన జారీ చేసారు . 

జనవరి 3 నుంచి పింఛన్‌ వారోత్సవాలు 

వృద్దులకు ,వితంతువులకు ,దివ్యంగులు సహా ఇతరులకు ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పెన్షన్ లను 2500 నుంచి 2750కు పెంచుతున్న నేపథ్యంలో జనవరి 3 నుంచి వారోత్సవాలు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం . సీఎం జగన్ స్వయంగా వీటిని జనవరి 3న రాజమండ్రిలో ప్రారంభించనున్నారు . 

SI దరఖాస్తుల గడువు 18 వరకూ పొడిగింపు 

411 SI పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్ శాఖ అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు గడువుతేదీని జనవరి 18 వరకూ పొడిగించింది. ముందుగా జనవరి 1 వరకే గడువు అని చెప్పినా ప్రస్తుతం ఆ గడువును పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటన జారీ చేసింది . 

రాజమండ్రి,విశాఖ పర్యటనకు సోము వీర్రాజు 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు . ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న ఆయన అనంతరం విశాఖ బయలుదేరి వెళతారు . 

నారా లోకేష్ పాదయాత్ర అధికార ప్రకటన నేడే 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర తేదీలను టీడీపీ నేడు అధికారికంగా ప్రకటించనుంది . జనవరిలో సంక్రాంతి తరువాత లోకేష్ తన పాదయాత్ర  ప్రారంభించనున్నారు. 

Published at : 28 Dec 2022 09:04 AM (IST) Tags: AP Latest news Telugu News Today AP News Developments Today AP Headlines Today

సంబంధిత కథనాలు

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్

Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్

రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడూ నోరు అదుపులో పెట్టుకో: డిప్యూటీ స్పీకర్

రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడూ నోరు అదుపులో పెట్టుకో: డిప్యూటీ స్పీకర్

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే "ఉక్కు ప్రజా గర్జన "

Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం