అన్వేషించండి

NEET Results 2023: చదువుతుంటే నిద్రవచ్చేది, కానీ ఈ టెక్నిక్ పాటించా- ABP దేశంతో NEET ర్యాంకర్ బొర్రా వరుణ్ చక్రవర్తి

NEET ఫలితాల్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొర్రా వరుణ్ చక్రవర్తి.

పోటీ పరీక్షలు అంటేనే విద్యార్థులతో పాటు అభ్యర్థులలో విపరీతమైన ఒత్తిడి. ర్యాంక్ ల కోసం గంటల తరబడి చదివేస్తుంటారు. కానీ అలా ఒత్తిడికి దూరంగా చదివితే ఊహించని స్థాయిలో మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు బొర్రా వరుణ్ చక్రవర్తి. తాజాగా విడుదలైన NEET ఫలితాల్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొర్రా వరుణ్ చక్రవర్తి. నీట్ పరిక్షల కోసం ప్రెపరేషన్ ఎలా జరిగింది. ఎంత సమయం కేటాయించారు. తోటి విద్యార్దులకు ఏం చెప్పబోతున్నారంటూ వరుణ్ ని పలకరించింది ABP దేశం. ఈ సందర్బంగా ఏబీపీ దేశంతో మాట్లడుతూ అందరూ తాను రోజుకు ఎన్నిగంటలు చదివానంటూ అడుగుతున్నారని, అలా గంటల తరబడి తాను చదవలేదని ,చదివిన సమయం మాత్రం ఏకాగ్రతతో చదివానని చెప్పారు.

ఒక్కోసారి చదువు మొదలుపెట్టిన కొద్దిసేపటికే తనకు నిద్ర వచ్చేదని, అలా నిద్రవచ్చినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుని అలసిపోకుండా, ఒత్తిడికి గురికాకుండా నీట్ కోసం ప్రెపేర్ అయ్యానంటూ తెలిపారు వరుణ్ చక్రవర్తి. కాలేజీలో వారు ఇచ్చిన స్టడీ మెటీరియల్ తో పాటు , టీచర్స్ ఇచ్చే  సూచనలు తన ఈ విజయానికి దోహదం చేశాయన్నారు. నీట్ కోచింగ్ సమయంలో క్లాస్ రూమ్ లో పాఠాలు వింటున్న క్రమంలో ఏకాగ్రతగా ఉండటం వల్ల కొత్త త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు షెడ్యూల్ ప్రకారం చదువుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయగలిగామన్నారు. నీట్ లో 720 మార్కులకు గాను 720 సాధించి టాప్ లో జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకర్ గా నిలవడం ఆనందంగా ఉందని, ఈ విజయానికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాలేజీ యాజమాన్యానికి ధన్యావాదాలు తెలిపారు. శ్రీకాకుళం లాంటి జిల్లా నుండి జాతీయ స్దాయిలో పేరు తెచ్చుకోవడం గర్వంగా ఉందని, తమ జిల్లా నుంచి ఉత్తమ ర్యాంక్ లు కైవసం చేసుకున్నవారు సైతం అనేక మంది ఉన్నారని అన్నారు వరణ్ చక్రవర్తి. 
Also Read: NEET UG Results 2023: నీట్ యూజీ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు- సిక్కోలు బిడ్డకు రెండో ర్యాంక్!

ఈ సందర్భంగా వరణ్ తల్లిదండ్రులు ABP దేశంతో మాట్లాడుతూ తమ బిడ్డ విజయం ఎంతో సంతోషానిచ్చిందని తెలిపారు. మేమిద్దరం టీచర్స్ కావడంతో మా వరణ్ ను ఏమాత్రం ఒత్తిడి చేయకుండా తనకు తాను చదువుకునేలా అవకాశం కల్పించామన్నారు.ర్యాంకుల కోసం పిల్లలను ఒత్తిడి చేయడం సరైనది కాదని, ఒత్తిడి వల్ల ప్రతిభ కనబర్చాల్సిన విద్యార్థులు ఇంకా దిగువ స్దాయిలో ఫలితాలు తెచ్చుకుంటున్నారని తెలిపారు. పోటీ పరిక్షలకు ప్రిపేరవుతున్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించి, దానికి తగినట్లుగా టార్గెట్ ఫిక్స్ చేయాలని సూచించారు. అలా కాకుండా అందరికీ ఓకే లక్ష్యం అన్నట్లుగా తీవ్ర ఒత్తిడి చేస్తే చదువులో ముఖ్యంగా NEET వంటి పోటీ పరిక్షల్లో మరింత వెనుకబడే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: NEET UG: ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారానే మెడికల్ కాలేజీల్లో యూజీ ప్రవేశాలు, ఎన్‌ఎంసీ ప్రతిపాదన!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
Yash: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
MS Dhoni Animated Discussion: మిస్ట‌ర్ కూల్ కు కోపమొచ్చింది.. అంపైర్ తో సీరియ‌స్ గా చ‌ర్చించిన ధోనీ.. ముంబై చేతిలో ఓట‌మితో నిరాశ‌
మిస్ట‌ర్ కూల్ కు కోపమొచ్చింది.. అంపైర్ తో సీరియ‌స్ గా చ‌ర్చించిన ధోనీ.. ముంబై చేతిలో ఓట‌మితో నిరాశ‌
Embed widget