Maruti Brezza Mileage: బ్రెజ్జా పెట్రోల్, CNG రెండింటినీ ఫుల్ చేస్తే ఎంత రేంజ్ ఇస్తుంది, మైలేజ్ ఎంత?
Maruti Brezza Full Tank Range: మారుతి సుజుకి పవర్‌ఫుల్ SUV బ్రెజ్జా 1.5 లీటర్ పెట్రోల్ & CNG ఇంజిన్‌తో వస్తుంది. దీని రెండు ట్యాంకులు ఫుల్ చేస్తే వందల కిలోమీటర్లు హ్యాపీగా వెళ్లవచ్చు.

Maruti Brezza Full Tank Capacity And Mileage Details: సామాన్యుడి కార్ బ్రాండ్ మారుతి సుజుకి. ఈ బ్రాండ్ కింద ప్రీమియం సెగ్మెంట్ ఫోర్ వీలర్లు వచ్చినప్పటికీ, ఇది కామన్ మ్యాన్ కారులో అని ప్రజల్లో ముద్రించుకుపోయింది. ఇది ఒక కోణంలో ఆ కంపెనీకి ప్లస్ పాయింట్ అయితే, మరో కోణంలో మైనస్ పాయింట్ అవుతుంది. మారుతి సుజుకి కంపెనీ, వితారా బ్రెజ్జాను తొమ్మిదేళ్ల క్రితం, 2016 మార్చిలో మొట్టమొదటిసారి లాంచ్ చేసింది. ఈ లాంచింగ్ ద్వారా కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లోకి టైర్ పెట్టింది. అప్పటి నుంచి దీనిలో చాలా అప్‌డేషన్స్ వచ్చాయి & వితారా బ్రెజ్జా కాస్తా బ్రెజ్జాగా మారిపోయింది.
తొలి చూపులోనే ఆకట్టుకునేలా మారుతి బ్రెజ్జా ఔట్‌లుక్/ ఎక్స్‌టీరియర్‌ను డిజైన్ చేశారు, కార్ ప్రియులు దీని ఇంటీరియర్‌ను కూడా ఇష్టపడుతున్నారు. అంతేకాదు, మెరుగైన మైలేజ్ వల్ల కూడా మారుతి బ్రెజ్జా బెటర్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
మారుతి సుజుకి బ్రెజ్జా ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
మారుతి బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (Maruti Brezza Engine) అమర్చారు, ఇది 102 bhp పవర్‌ను & 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సామర్థ్యం గల CNG ఇంజిన్ కూడా ఉంది, ఇది 88 PS పవర్‌ను & 121.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కంపెనీ ఈ కారులో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించింది. మారుతి సుజుకి బ్రెజ్జా SUV పెట్రోల్ మోడల్‌లో 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లు ఉన్నాయి. కాగా, దీని CNG వేరియంట్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించారు. ఈ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కారును స్మూత్‌గా పరుగులు తీయించేలా డిజైన్ అయ్యాయి.
మారుతి బ్రెజ్జా పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ మోడ్‌లో లీటర్‌కు 17.80 కిలోమీటర్ల మైలేజీని (Maruti Brezza Petrol Variant Mileage) ఇస్తుందని ఈ కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆటోమేటిక్ మోడ్‌లో ఇది లీటర్ పెట్రోల్‌కు 17.89 కి.మీ. మైలేజీ ఇస్తుందని వెల్లడించింది. కాగా, బ్రెజ్జా CNG వేరియంట్ కిలోగ్రాముకు 26 కి.మీ. మైలేజీని (Maruti Brezza CNG Variant Mileage) ఇవ్వగలదన్నది కంపెనీ ప్రకటన.
ఫుల్ ట్యాంక్ మీద బ్రెజ్జా డ్రైవింగ్ రేంజ్ ఎంత?
మారుతి బ్రెజ్జా SUVలో కంపెనీ 48 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌ను అందించింది. ఈ ట్యాంక్‌ను ఫుల్ చేస్తే, కంపెనీ చెప్పిన 17.80 కి.మీ. మైలేజీ ప్రకారం, దాదాపు 855 కి.మీ. దూరం (17.80 x 48) ప్రయాణించగలదు. ఇది కాకుండా, బై-ఫ్యూయల్ (పెట్రోల్ + CNG) మోడల్‌లో, రెండు ట్యాంకులను పూర్తిగా నింపితే, ఈ SUV 1,050 కి.మీ.ల లాంగ్ రేంజ్‌ను (కంపెనీ వెల్లడించిన ప్రకారం) ఇవ్వగలదు.
మారుతి సుజుకి బ్రెజ్జా ధర
మారుతి బ్రెజ్జా SUV ఎక్స్-షోరూమ్ ధర (Maruti Brezza SUV ex-showroom price) రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.98 లక్షల వరకు ఉంటుంది.





















