RANABAALI Decode | Vijay Deverakonda Rashmika తో Rahul Sankrityan పీరియాడికల్ డ్రామా | ABP Desam
దేశం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ నుంచి VD14 కాన్సెప్ట్ వీడియో వచ్చింది. ఈ సినిమాకు రణబాలి అని టైటిల్ పెట్టారు. అయితే ఈ కథ స్వాతంత్ర్యం మనకు ఎలా దక్కింది అని చెప్పే కథ కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే 40-50 ఏళ్లకు ముందు దేశంలో జరిగిన దారుణ మారణ కాండ గురించే చెప్ప కథ ఈ సినిమా. జర్మనీలో హిట్లర్ హోలోకాస్ట్ ను మించిపోయేలా...మన దేశంలో 10 కోట్ల మంది ఆకలి చావులకు కారణమైన కథ. అన్నపూర్ణగా వర్థిల్లిన దేశం నుంచి 45లక్షల కోట్లకు పైగా సంపద తెల్లదొరల దోపిడీకి గురైన కథ. బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటూ క్వీన్ విక్టోరియా కిరీటం దేశాన్ని ఏలుతుంటే గవర్నర్ జనరల్లే రాక్షస ప్రభువులుగా మారి దేశాన్ని ఆకలి చావుల్లోకి నెట్టి ఆ రక్తంతో ఇక్కడి నేలలను తడిపిన కథ. ఈ దారుణ మారణ హోమాన్ని ఎదిరిస్తూ నిలబడిన రణబాలి కథ. కొడవలి,కత్తి భుజాన వేసుకుని గుర్రాలకు దుష్టపాలకులను వేలాడగట్టి రౌద్రంగా రప్పా రప్పా ఈడ్చుకుంటూ వెళ్లిన వీరుడి కథ. రణబాలి కాన్సెప్ట్ వీడియోలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ చెప్పింది ఇదే. డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఆమె జయమ్మకు కనిపించనున్నారు. మమ్మీ సినిమా ద్వారా ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఆర్నాల్డ్ వోస్లో రణబాలిలో సర్ థియోడర్ హెక్టార్ గా నటిస్తున్నారు. సుప్రసిద్ధ మరాఠీ సంగీత దర్శక ద్వయం అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ ప్రొడక్షన్ హౌస్ సెస్ గా ఉన్నాయి. సెప్టెంబర్ 11న ఈ ప్యాన్ ఇండియా సినిమాను ఐదు బాషల్లో విడుదల చేస్తున్నట్లు డేట్ కూడా ఇచ్చారు. చూడాలి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ బాట పడతారేమో.























