Sanju Samson Ind vs NZ T20 | వరుసగా విఫలమవుతున్న సంజు
టీమ్ ఇండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ( Shubman Gill ) చాలా మ్యాచులో విఫలమైయ్యాడు. అప్పుడు అందరికి గుర్తు వచ్చిన పేరు సంజు శాంసన్ ( Sanju Samson ). గిల్ కు బదులుగా సంజుకు ఛాన్స్ ఇవండీ అంటూ ఎంతోమంది అభిమానులు బీసీసీపై కామెంట్స్ చేసారు. మాజీ క్రికెటర్ లు కూడా ఈ విషయంపై స్పందించారు. ఫార్మ్ లేనివారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వడం అని మండిపడ్డారు.ఇప్పుడు సంజు పరిస్థితి కూడా శుబ్మన్ గిల్ లాగానే మారింది.
సంజు శాంసన్ కు టీమ్ లో చోటు దక్కింది. అవకాశం వచ్చిన తర్వాత సంజు మాత్రం వరుసగా నిరాశ పరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో సంజుకు ఓపెనర్‌గా అవకాశం దక్కింది. కానీ మూడవ టీ20లో సంజు తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇప్పటికే వికెట్ కీపర్ స్థానం కోసం టీమ్ లో ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వంటి ప్లేయర్స్ మధ్య పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో ఛాన్స్ వస్తే దాని ఉపయోగించుకోవాలి అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. న్యూజీలాండ్ తో జరిగిన రెండవ టీ20లో 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసిన శాంసన్, తొలి మ్యాచ్‌లో 7 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు. తనపై వస్తున్న ఈ ట్రోల్స్ కు సంజు ఎలా సమాధానం చెప్తాడో చూడాలి.





















