Group 1 Exams Schedule: అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
AP Group 1 Mains Exam Schedule | ఏపీలో గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మే మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి.

APPSC Group 1 Exams Schedule | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీ ఖరారు అయింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ (APPSC) గుడ్ న్యూస్ చెప్పింది. మే 3వ తేదీ నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ నిర్వహణకు 4 జిల్లా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పలు శాఖలలో ఖాళీగా ఉన్న 81 గ్రూప్ పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ విధానంలో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అర్హత పరీక్షలైన తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో క్వాలిఫై కావాలి. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారి పేపర్లు మాత్రమే కరెక్షన్ చేస్తారని అభ్యర్థులకు తెలిసిందే.
గ్రూప్ 1 పరీక్షల షెడ్యూల్ వివరాలు
- మే 3, 2025- తెలుగు (అర్హత పరీక్ష)
- మే 4, 2025- ఇంగ్లీష్ (అర్హత పరీక్ష)
- మే 5, 2025- పేపర్-I: జనరల్ ఎస్సే
- మే 6, 2025- పేపర్-II: భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం
- మే 7, 2025- పేపర్-III: పాలిటీ, రాజ్యాంగం, పరిపాలన, చట్టం, రాజనీతి
- మే 8, 2025- పేపర్-IV: భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
- మే 9, 2025- పేపర్-V: సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ అంశాలు, సమస్యలు






















