అన్వేషించండి

Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు

మిచౌంగ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న ఈ సమయంలో నెల్లూరు అండర్ బ్రిడ్జ్ లు నీట మునిగాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం స్కూల్స్ కి సెలవు. మంగళవారం కూడా సెలవు పొడిగించే అవకాశముంది.

మిచౌంగ్ తుపాను కారణంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షారు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. నెల్లూరు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షపునీరు పోయే జాడ లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు

నెల్లూరు నగరం మధ్యనుంచి రైల్వే లైన్ వెళ్తుంది. ఈ రైల్వేలైను నెల్లూరు నగరాన్ని రెండుగా విభజిస్తుంది. అంటే నగరంలో రైల్వే లైన్ క్రాస్ చేసి అటు ఇటు ప్రయాణించాలంటే అండర్ బ్రిడ్జ్ లే దిక్కు. లెవల్ క్రాసింగ్ లు ఉన్నా కూడా రైళ్ల రద్దీతో వాటిని నగరవాసులు పెద్దగా ఉపయోగించరు. ఒకే ఒక్క ఫ్లైఓవర్ ఉన్నా.. అది నగరానికి చివర్లో ఉంటుంది. వర్షం వస్తే నగరంలోని అండర్ బ్రిడ్జ్ లు నీట మునుగుతాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఆదివారం అండర్ బ్రిడ్జ్ ల వద్ద పలు వాహనాలు నిలిచిపోయాయి. పాదచారులు అటు నుంచి ఇటు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారీ ఈ సమస్య ఉండేదే అయినా నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మిచౌంగ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న ఈ సమయంలో నెల్లూరు అండర్ బ్రిడ్జ్ లు నీట మునిగాయి. నగర వాసులకు నరకం చూపించాయి. 

Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు

సముద్ర తీర ప్రాంతాలకు కలెక్టర్..
మిచౌంగ్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్. అల్లూరు మండలం సముద్ర తీర గ్రామమైన ఇస్కపల్లిలో కలెక్టర్ పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భారీ వర్షం,గాలులు వీస్తున్నందున  ప్రజలు సురక్షిత ప్రాంతానికి, సైక్లోన్ షెల్టర్లకు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి  పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు కలెక్టర్. తీరప్రాంతంలో వున్న 9 మండలాల తహిశీల్దార్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు కలెక్టర్. 

Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు

ఎస్పీ పరిశీలన..
మిచౌంగ్ తుఫాన్ కారణంగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. సముద్ర తీర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఎస్పీ పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడారు. వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా, తుపాను వెళ్లిపోయేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల సహాయార్థం, సహాయక చర్యల కోసం పోలీసు సిబ్బంది 24 గంటలు అందుబాటు ఉంటారని భరోసా కల్పించారు. ప్రజలు పోలీసు సహాయక చర్యలకు డయల్- 112/100 లేదా పోలీసు హెల్ప్ లైన్ నంబర్  9392903413 కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించగలరని సూచించారు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. 

Cyclone Effect in Nellore: నెల్లూరులో భారీ వర్షాలు, చెరువులను తలపిస్తున్న రహదారులు

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన చౌంగ్ తుపాను రేపు(మంగళవారం) తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నానికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గర్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సోమవారం స్కూల్స్ కి సెలవు ఇచ్చారు. అవసరమైతే మంగళవారం కూడా సెలవు పొడిగించే అవకాశముంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Embed widget