అన్వేషించండి

Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం

Cyclonic Storm Fengal Update: ఫెంగల్ తుపాను ఈ మధ్యాహ్నం తీరం దాటబోతోంది. ఆదే టైంలో నెల్లూరు సహా ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Andhra Pradesh Cyclone News: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, ట్రింకోమలీ(శ్రీ లంక)కి ఉత్తర ఈశాన్యముగా 130 కిలోమీటర్లు నాగపట్టణానికి తూర్పుగా 150 కి.మీ. . దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గర కారైకాల్ మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ టైంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 

ఈ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

రెడ్‌ అలర్ట్ జారీ అయిన జిల్లాలు: నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలకు ఛాన్స్‌ ఉందంటున్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కడప ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలు(Temperature In Andhra Pradesh District Wise)
 
  ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) తేమ  శాతం
1
కళింగపట్నం 
28.1 22.8  65
2
విశాఖపట్నం 
29 24.6 59
3
తుని 
31.7 24.4  65
4
కాకినాడ 
30.2    24.5    59
5
నర్సాపురం
29.8  21.8    58
6
మచిలీపట్నం 
30.7  24.5    70
7
నందిగామ 
30.6    19.4     68
8
గన్నవరం 
31.2    23.7    61
9
అమరావతి 
31.2    22.5    69
10
జంగమేశ్వరపురం 
31.3 20.5    78
11
బాపట్ల 
31.4    22    71
12
ఒంగోలు 
30.9  24.5    58
13
కావలి 
30.2  24.7    61
14
నెల్లూరు 
28.6    24.1    79
15
నంద్యాల 
31.5   19.8    57
16
కర్నూలు 
31.4    20.2    58
17
కడప 
30.5     23.4    74
18
అనంతపురం 
29.8    18.3    69
19
ఆరోగ్యవరం 
25.5     20    72
20
తిరుపతి 
29.2  21.1    94

తమిళనాడులో వాతావరణం(Weather In Tamil Nadu)
ఫెంచల్ తుఫాను కారణంగా తమిళనాడులోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులోని పుదుచ్చేరి, కారైకాల్‌, చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు. కాంచీపురం, విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాణిపేట్, తిరువణ్ణామలై, వేలూరు, పెరంబలూరులో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కురుసే ఛాన్స్ ఉంది. అరియలూర్, తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై, నాగపట్నం జిల్లాలు వర్షాలు పడతాయి. తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, తిరుచిరాపల్లి, పుదుకోట్టై, కరూర్ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కరుస్తాయని చెబుతున్నారు. 

చెన్నైలో వాతావరణం(Weather In Chennai)
రానున్న 24 గంటలపాటు ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం పడనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Embed widget