అన్వేషించండి

Lathi Charge On Cotton Farmers In Adilabad: : ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్- ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం

Telangana News: రైతుల ప్రయోజనాలు గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు బీఆర్‌ఎస్ నేతలు. ఆదిలాబాద్‌లో రైతులపై జరిగిన లాఠీ ఛార్జ్‌ను తీవ్రంగా ఖండించారు.

Adilabad Lathi charge News : తెలంగాణలో విత్తనాలపై లొల్లి మొదలైంది. వర్షాలు రాక ముందు నుంచే విత్తనాల అమ్మకాలు షురూ చేసిన ప్రభుత్వానికి కష్టాలు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటైంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన మరింత విమర్శలపాలు చేస్తోంది.  

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం అన్నదాతులు రోడ్డు ఎక్కారు. భారీగా వచ్చిన రైతులను కంట్రోల్‌ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ కోతలతో అల్లడిపోతుంటే ఇప్పుడు ప్రభుత్వం విత్తనాలు కూడా అందివ్వలేని దుస్థితిలో ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రతి సారీ ఇలాంటి పరిస్థితి ప్రజలకు తప్పడం లేదని బీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్ అవుతున్నారు. విత్తనాల కోసం వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులపై లాఠీ ఛార్జ్ చేయడం ఏంటని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌ పాలనలో రైతుల కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయని కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులని ప్రబుత్వం ఏం చేయలేకపోతోందని మండిపడుతోంది. 

అదిలాబాద్ లాఠీచార్జీని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్.రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అన్నారు. 

"విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం. ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లో రాష్ట్ర వ్యవసాయాలను ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారి పోయింది. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 

మార్పు తెస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ తీసుకువస్తామన్న మార్పా?. గత పది సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగం ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు అన్నింటిని సాఫీగా అందుకున్నది. కేవలం 5 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమార అయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలన వైఫల్యం."

"ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. రైతన్నలపై చేసిన దాడికి క్షమాపణ చెప్పాలి.  రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యవసాయ వ్యవసాయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టైంలో సీఎం ఎన్నికల ప్రచారం పేరిట, ఢిల్లీ పర్యటన పేరిట రాజకీయాలు చేయడం ఏంటీ. "

ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి విత్తనాల కొరత, పంపిణీ, ప్రభుత్వ వైఫల్యంపై ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేయాలి. రైతన్నల కష్టాలు తొలగించే విధానం తీసుకురావాలి. లాఠీ చార్జ్ చేసిన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పు అంటూ ప్రశ్నించారు. పాలన గాలికి వదిలేసి మంత్రులు, ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్తారా అంటు నిలదీస్తున్నారు. "పత్తి విత్తనాలే కాదు .. ఎరువు కింద ఉపయోగించే జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఆందోళనలు చేయాల్సి రావడం దురదృష్టకరం. జీలుగ విత్తనాలకే దిక్కులేదు. ఇక అసలు విత్తనాలు ఇస్తారన్న నమ్మకం రైతులలో ఎలా కలిగిస్తారు"

రైతులకు విత్తనాలు ఇవ్వలేని అసమర్ద కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలి అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్దత, నిర్లక్ష్యం కారణంగా మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు."కాంగ్రెస్ వచ్చి రాష్ట్రంలో పాతరోజులు మళ్లీ తెచ్చింది. విత్తనాలు, ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. తాజాగా లాఠీఛార్జీలు మొదలయ్యాయి. "

"రైతులు అడుగుతున్నది రేషన్ బియ్యం కాదు. మనిషికి రెండు విత్తన ప్యాకెట్లు మాత్రమే ఇవ్వడానికి ఎందుకంత కష్టం. రైతులు అడుగుతున్నది పంట పండించడానికి కావాల్సిన విత్తనాలు. ఆరునెలలలో వ్యవసాయ తిరోగమనం మొదలైంది. ఒకవైపు అకాలవర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటుకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని విడిచిపెట్టి కేరళ, పంజాబ్‌లలో పర్యటిస్తున్నారు. విత్తనాల కొరత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు"

"రాష్ట్రంలో ప్రచారం ఫుల్లు .. పాలన నిల్లు  అన్నట్లు సాగుతోంది. వెంటనే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. ఏఏ జిల్లాలలో ఎంతెంత ఎరువులు, విత్తనాలు ఉన్నది శ్వేతపత్రం విడుదల చేయాలి" అని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget