అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Phone Tapping Case News : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు మరోసారి కొట్టివేసింది.వారు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది.

Telangana Phone Tapping Case :  ఫోన్ టాపింగ్ కేసులో మరొకసారి అరెస్ట్ అయిన నిందితులకు మరోసారి చుక్కెదురు అయింది.  అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్ రావు బెయిల్ పిటీషన్   నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయనందున బెయిల్ కావాలని  నిందితులు కోరారు.  తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పై వాదనల సమయంలో  కోర్టుకు తెలిపారు. అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వవచ్చునని వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వవచ్చునని పలు తీర్పులు చెబుతున్నాయన్నారు.  అయితే, తాము 90 రోజుల లోపే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఛార్జిషీట్‌ను కోర్టు తిప్పి పంపించిందని... ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసులు  తెలిపారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. 

ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావాల్సి ఉంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్‌ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్‌ అయ్యే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది.. ఆయన వీసా గడువు ముగిసిందని ఎప్పుడైనా ఇండియాక రావొచ్చని భావిస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం వచ్చానని పోలీసులకు అందుబాటులో ఉంటానని జూన్‌26న భారత్​ కు వస్తానని అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు కోర్టులో మెమో దాఖలు చేశారు.  అయితే ఆయన రాలేదు. వీసా గడువు పొడిగించుకుని ఉండవచ్చని చెబుతున్నారు.  మరో నిందితుడు శ్రవణ్ రావుకు కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.                               
  
ఈ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తాన్ని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించారు. మూడు బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు.  ఇందులో హార్డ్ డిస్క్‌లు, సిడీ, పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి. ఈ మెటీరియల్ ఎవిడెన్స్‌లు లేని కారణంగా రెండు సార్లు చార్జిషీటును కోర్టు వెనక్కి పంపింది.  ఫైనల్‌గా అన్నిటినీ జత పరుస్తూ పోలీసులు మూడోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాగా.. ఈ ఆధారాలను నిందితులకు తెలీకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ కోరారు.              

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి.  బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్  పార్టీ గెలిచిన రోజునే ఆధారాలన్నీ శ్రవణ్ రావు ధ్వంసం చేసినట్లుగా తెలియడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పట్నుంచి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget