అన్వేషించండి
Indhiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు వడపోత పూర్తి, తొలిదశలో 71,482 మందికి అందజేత
Telangana Government: ఐదు హామీలు అమల్లో భాగంగా రేవంత్ సర్కార్ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. సొంతింటి స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యం కల్పించనుంది.

ఇందిరమ్మ ఇల్లు
Source : X
Indhiramma House: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఐదు హామీలు అమలు చేసే దిశగా తెలంగాణలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇప్పటికే కీలకమైన రైతుభందు, రైతురుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ అందజేసిన కాంగ్రెస్ ప్రభుత్వం...మరో కీలకమైన ఇందిరమ్మ ఇళ్లు (Indhiramma Houses)పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రజాపాలన,గ్రామసభల ద్వారా సేకరించిన దరఖాస్తులను వడిపోసి లబ్ధిదారులను మూడు జాబితాలుగా విభజింంచారు. త్వరలోనే వీరందిరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు..
మూడు దశల్లో ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్లు కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు మూడు విభాగాలుగా విభజించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇళ్లు లేనివారిని ఎల్-1 జాబితాలో చేర్చారు. సొంత స్థలం ఉండి గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారిని ఈ జాబితాలో చేర్చారు. ముందుగా వీరు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం చేయనుంది.ఇప్పటికే స్థలం ఉంది కాబట్టి...ఆ స్థలంలోనే ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆసరా అందించనుంది. సొంత స్థలం లేనివారిని ఎల్-2 జాబితాలో చేర్చారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇళ్లు లేనివారే. సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3లో చేర్చారు.
పకడ్బందీగా సర్వే
ఇందిరమ్మ ఇళ్లకోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. యాప్ సర్వే( App Survey),కుటుంబ సర్వే ఆధారంగా వారిని మూడు విభాగాలుగా విభజించారు. దీనిప్రకారం ఎల్-1లో 21.93 లక్షలు, ఎల్-2లో 19.96 లక్షలు, ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులను చేర్చారు.
అయితే హైదరాబాద్ నగరపాలక సంస్థ (GHMC)పరిధిలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సిఉంది. మొదటి విడదతలో రాష్ట్రవ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో ఎల్-1 నుంచి 59,807 మంది లబ్ధిదారులు, ఎల్-2 నుంచి 1,945 మంది లబ్ధిదారులు, ఎల్-3 నుంచి 5,732 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.అలాగే కొత్త దరఖాస్తుల నుంచి మరో 3,998 మందికి అవకాశం కల్పించారు.
సొంత స్థలం ఉన్నవారికే తొలి అవకాశం
ప్రభుత్వం ఇప్పటికిప్పుడు భూసేకరణ చేసి స్థలాలు ఇచ్చి ఇంటిని నిర్మించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో తొలిదశలో సొంతగా స్థలం ఉండి...ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురుచూస్తున్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఎల్-1 నుంచి అత్యధికంగా 59,807 మందిని ఎంపిక చేశారు. అలాగే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఎల్-2, ఎల్-3 జాబితాలు, కొత్తగా వచ్చిన దరఖాస్తుదారులకు కూడా 11,675 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. తొలి దశలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత దశలవారీగా ఎల్-1, ఎల్-2లోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎల్-3లో వచ్చిన 33.87లక్షల మంది దరఖాస్తుదారుల్లో మెజార్టీశాతం ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ఉన్నట్లు గుర్తించారు.
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ సందర్భంగా ప్రభుత్వం చాలా ప్రత్యామ్నాయాలు పరిశీలించింది. గత బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అవి దాదాపు అపార్ట్‌మెంట్ రూపంలో బ్లాకులుగా ఉండటం...వాటిల్లో చాలా చోట్ల అసంపూర్తి నిర్మాణాలే ఉండటంతో..కొత్తగా ఇందిరమ్మ ఇళ్లే ఇవ్వాలని నిర్ణయించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
తిరుపతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion