Sarayu Arrest: బిగ్ బాస్ ఫేమ్ సరయూ అరెస్ట్, ఆమె అనుచరులు కూడా.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు
సరయూతోపాటు ఆమె టీమ్‌లో ఉన్న దర్శక నిర్మాత, శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తీక్, కృష్ణ మోహన్‌లను కూడా అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే యూట్యూబర్, బిగ్ బాస్ బ్యూటీ అయిన సరయూను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరయూతోపాటు ఆమె టీమ్‌లో ఉన్న దర్శక నిర్మాత, శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తీక్, కృష్ణ మోహన్‌లను కూడా అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి నోటీసులు జారీ చేశారు.
బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సరయూతో పాటు ఆమె టీమ్ ‘7 ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్ కోసం గత సంవత్సరం నిర్వహించిన ఓ షార్ట్ ఫిల్మ్.. హిందూ సమాజాన్ని, మహిళలను కించపర్చే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో కేసును బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఆ వీడియో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153a, 295a సెక్షన్ ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం వీరిని మరోసారి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
సిరిసిల్లలోని హోటల్ ప్రమోషన్ పాటలో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి, లిక్కర్ సేవించి హోటల్‌ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ సాంగ్‌లో ఉందని, ఈ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ వెల్లడించారు. ఈ విధంగా ప్రవర్తించి హిందువుల మనోభావాలను కించపరినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించబోదని అన్నారు.
మరోవైపు, బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్‌గా నిలిచిన వీజే సన్నీ హీరోగా నటిస్తున్న ‘సకల గుణాభిరామ’ అనే సినిమాలో సరయు నటించింది. ఈ సినిమా బిగ్ బాస్ ముందే షూటింగ్ ముగిసినప్పటికీ వేర్వేరు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.