BSNL: రూ.215 ప్లాన్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్ - మరో ప్లాన్ కూడా - వీటి లాభాలేంటి?
BSNL Rs 628 Plan: బీఎస్ఎన్ఎల్ రెండు చవకైన ప్లాన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.628, రూ.215 ప్లాన్లు. వీటి ద్వారా ఎలాంటి లాభాలు లభించనున్నాయి?

BSNL Cheapest Prepaid Plans: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. కంపెనీ తన వినియోగదారుల కోసం రెండు కొత్త, చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ముఖ్యంగా తక్కువ ధరకు మెరుగైన సేవలను కోరుకునే వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌లు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగదారులు రూ.215, రూ.628 ప్లాన్‌లలో ఉచిత కాలింగ్, డేటా వంటి సౌకర్యాలను పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ రూ.628 ప్లాన్ (BSNL Rs 628 Plan)
బీఎస్ఎన్ఎల్ రూ.628 ప్లాన్ దీర్ఘకాలిక వినియోగదారులకు గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రతిరోజూ 3 జీబీ హై స్పీడ్ 4జీ డేటాను అందిస్తుంది. దీంతో మొత్తం 252 జీబీ డేటాను పొందవచ్చు. దీంతో పాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఉచిత కాలింగ్, జాతీయ రోమింగ్ సౌకర్యం కూడా అందించనున్నారు. దీంతో పాటు వినియోగదారులు ఈ ప్లాన్‌లో జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లిస్ట్‌ఎన్ పోడ్‌కాస్ట్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌కు సంబంధించిన ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.
Also Read: రూ.30 వేలలోపే కొత్త ట్యాబ్ - షావోమీ ప్యాడ్ 7 వచ్చేసింది!
బీఎస్ఎన్ఎల్ రూ.215 ప్లాన్ (BSNL Rs 215 Plan)
స్వల్పకాలిక చవకైన రీఛార్జ్ కోరుకునే వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ రూ.215 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు మొత్తం 60 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ ఉచిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తక్కువ బడ్జెట్‌లో మంచి సర్వీసులను అందిస్తుంది.
రిలయన్స్ జియో రూ.479 ప్లాన్ (Jio Rs 479 Plan)
రిలయన్స్ జియో రూ.479 ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 1000 ఎస్ఎంఎస్‌లు, మొత్తం 6 జీబీ డేటా, 64 కేబీపీఎస్ వేగంతో డేటాను పొందుతారు. దీంతో పాటు ఈ ప్లాన్ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి అనేక జియో యాప్‌ల సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
Also Read: ఆస్తులు అమ్ముకోమంటారా బ్రో - పాకిస్తాన్‌లో మస్క్ స్టార్ లింక్ ధరలపై నెటిజన్ల కామెంట్!
Talk, stream, play, and groove non-stop!
— BSNL India (@BSNLCorporate) January 11, 2025
Get unlimited calls, high-speed data, SMS, games, podcasts, and music—all for just ₹215.
Your all-in-one entertainment pass is just a recharge away!
#BSNLIndia #StayUnlimited #EntertainmentOnTheGo pic.twitter.com/XiF3MHKVud
Say hello to non-stop fun and seamless connectivity! With BSNL's unbeatable offer—all for just ₹628. Valid for 84 days, this plan is your gateway to endless entertainment.
— BSNL India (@BSNLCorporate) January 11, 2025
Why wait? Recharge now and dive into unlimited possibilities! #BSNLIndia #StayUnlimited… pic.twitter.com/Qah3cbgO3g
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

