అన్వేషించండి

Xiaomi Pad 7: రూ.30 వేలలోపే కొత్త ట్యాబ్ - షావోమీ ప్యాడ్ 7 వచ్చేసింది!

Xiaomi Pad 7 Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ మనదేశంలో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. అదే షావోమీ ప్యాడ్ 7. దీని ధర రూ.30 వేలలోపు నుంచే ప్రారంభం కానుంది.

Xiaomi Pad 7 Launched: షావోమీ ప్యాడ్ 7 ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 8850 ఎంఏహెచ్‌గా ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇందులో 11.2 అంగుళాల 3.2కే ఎల్సీడీ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్ పని చేయనుంది. ఇందులో క్వాడ్ స్పీకర్ సిస్టంను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఏఐ ఆధారిత ఫీచర్లను ఇందులో అందించారు. ఏఐ రైటింగ్, ఏఐ లైవ్ సబ్‌టైటిల్స్ వంటి ఫీచర్లు కూడా ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. 

షావోమీ ప్యాడ్ 7 ధర (Xiaomi Pad 7 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.30,999గా నిర్ణయించారు. నానో టెక్చర్ డిస్‌ప్లే ఎడిషన్ అనే హై ఎండ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.32,999గా నిర్ణయించారు. అమెజాన్, షావోమీ ఇండియా ఈ-స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. జనవరి 13వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ వినియోగదారులకు రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది.

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

షావోమీ ప్యాడ్ 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Xiaomi Pad 7 Specifications)
ఇందులో 11.2 అంగుళాల 3.2కే ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఈ ట్యాబ్లెట్‌లో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పని చేయనుంది.

12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను ఈ ట్యాబ్‌లో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ఓఎస్ 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై షావోమీ ప్యాడ్ 7 రన్ కానుంది. ట్యాబ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో చూడవచ్చు. క్వాడ్ మైక్ సెటప్, డాల్బీ అట్మాస్ ఉన్న క్వాడ్ స్పీకర్ సిస్టం ఈ ట్యాబ్‌లో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 8850 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.4, యూఎస్‌బీ 3.2 టైప్-సీ జెన్ 1 పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఇన్‌ఫ్రారెడ్ ట్రాన్స్‌మిట్టర్‌తో ఈ ట్యాబ్ ఎక్విప్ అయిది. దీని మందం 0.62 సెంటీమీటర్లు కాగా, బరువు 500 గ్రాములుగా ఉంది.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ

వీడియోలు

MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pilot Shortage In India: భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
భారత్ విమానయాన రంగంలో పైలట్ల కొరత- శిక్షణ పొందే వాళ్లకు ఉద్యోగాలు గ్యారంటీ!
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
Actor Rajasekhar Injured: నటుడు రాజశేఖర్‌ కాలి సర్జరీ విజయవంతం! గత నెలలో షూటింగ్‌లో గాయపడ్డ యాంగ్రీస్టార్‌!
నటుడు రాజశేఖర్‌ కాలి సర్జరీ విజయవంతం! గత నెలలో షూటింగ్‌లో గాయపడ్డ యాంగ్రీస్టార్‌!
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget