అన్వేషించండి

Kavya Maran: కన్నీళ్లు దాచలేకపోయిన కేరింతల కావ్య, SRH ఓనర్ బాధ వర్ణనాతీతం

IPL FINAL 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ SRH ఓటమి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌ను బాగా దెబ్బతీసింది. ఆఖరి యుద్ధంలో మట్టికరవడంతో ఫ్యాన్స్ దిగాలు పడిపోతే.. ఆ టీమ్ ఓనర్ కావ్యామారన్ కన్నీటిని దాచుకోలేకపోయారు.

Kavya Maran in Tears: IPL 2024 ట్రోఫీని ఎగరేసుకుపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ KKR కప్పును కొట్టడమే కాదు.. కావ్య పాపతో కన్నీళ్లు కూడా పెట్టించింది. చెన్నై చిదందబరం స్డేడియంలో వన్ సైడెడ్‌గా జరిగిన IPL ఫైనల్ ఆరెంజ్ ఆర్మీ గుండెలు బద్దలు చేసింది. ఆసారి కప్పు కొట్టి తీరుతున్నాం అన్నంత ధీమాతో ఫైనల్‌లో అడుగు పెట్టిన ఆరెంజ్ ఆర్మీకి మొదట్లోనే గట్టి దెబ్బ తగిలింది. చాలా తక్కువ స్కోరును కాపాడటానికి పాట్ కమిన్స్ ఏమైనా ఎత్తు వేస్తాడేమో అనుకున్నా అది పారలేదు.

మొదట్లోనే ఓటమి డిసైడ్ అవ్వడంతో సన్‌రైజర్స్ సేన డీలా పడిపోయింది. స్టేడియంలోనూ పెద్ద సందడి లేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత SRH ఓనర్ Kavya Maran  ఎమోషనల్ అయిపోయారు. తన కన్నీటిని దాచుకోలేకపోయారు. చెన్నైలో జరిగిన ఫైనల్‌లో తన టాప్ స్కాడ్ మొత్తం ఫెయిల్ అవ్వడంతో సన్‌రైజర్స్ 113 పరుగులు మాత్రమే చేసింది. దాన్ని KKR ఇంకో 59 బంతులు, 8 వికెట్లు చేతిలో ఉండగానే చేధించింది. వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో కోల్‌కతా చాలా ఈజీగా ఆ చిన్న టార్గెట్‌ను చేజ్ చేసేసింది. 

ఫ్రాంచైజ్ ఓనర్ అయినా సరే.. చిన్నపిల్లలా 
ఆరెంజ్ ఆర్మీ ఫాలోయర్లకే కాదు... మొత్తం IPL ఫ్యాన్స్ అందరికీ కావ్య పాప తెలుసు. ఫ్రాంచైజ్ ఓనర్ అయినా సరే.. చిన్నపిల్లలా స్డేడియంలో ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆరెంజ్ ఆర్మీకి బిగ్ సపోర్టర్ ఆమెనే. ప్రత్యర్థులపై SRH విరుచుకుపడుతున్నప్పుడు.. కావ్య చేసే హంగామా అంతా ఇంతా కాదు. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ ... గెంతులు వేస్తూ కావ్య తన టీమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా తన టీమ్ ఓడిపోతుంటే.. అదే రేంజ్‌లో డీలా పడిపోతుంది. కేవలం ఆటీమ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బయట వాళ్లు కూడా కావ్యను బాగా అబ్జర్వ్ చేస్తారు. మొత్తం మీద తనకో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి కావ్య ఇవాళ ఫైనల్‌లో Broke అవ్వడాన్ని తట్టుకోలేకపోయారు. 

ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ విశ్వరూపం 
కనివినీ ఎరుగని రేట్లతో ఆటగాళ్లను కొని ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగుతున్నప్పుడు.. SRH స్టాటజీని చూసి తిట్టుకున్న వాళ్లున్నారు. కానీ ఒక్కో మ్యాచ్‌ను అదరగొడుతూ.. రికార్జులను బద్దలు కొడుతూ.. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్‌లో విశ్వరూపం చూపించేసింది. రెండు మూడు మ్యాచ్‌లు జరిగే సరికే సన్‌రైజర్స్ టైటిల్ ఫేవరెట్లలో టాప్ ప్లేస్ కు వచ్చేసింది. ప్లే ఆఫ్స్‌ కు ముందు కాస్త తడబడ్డా రెండో స్థానానికి చేరి మొత్తానికి ఫైనల్లో కూడా అడుగుపెట్టింది. SRH అరివీర భయంకర బ్యాటింగ్ లైనప్ చూసిన వాళ్లంతా టైటిల్ వాళ్లదే అనుకున్నారు. కానీ చుక్కలు చూపిస్తారనున్నా టాప్ ఆటగాళ్లంతా నేలను చూశారు. దీంతో చాలా తక్కువ స్కోర్ కే వాళ్లు పరిమితం అయ్యారు. అయినా కానీ మంచి ఫామ్ లో ఉన్న కమిన్స్, భువి ఏదైనా మ్యాజిక్ చేస్తారు అనుకున్నారు కానీ అవ్వలేదు. సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. 

టైటిల్ పోయిన బాధతో పాటు కావ్యామారన్‌ను అలా చూడటం కూడా ఆరెంజ్ ఫ్యాన్స్‌కు మరింత బాధ వేసింది. కేరింతల కావ్య కన్నీళ్లు పెడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో బాగా షేర్ అవుతోంది. అయితే అంత బాధలో ఉన్న ఆమె ప్రత్యర్థి టీమ్‌ను అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొట్టారని అది మెచ్చుకునే విషయమని కొంతమంది ఆ వీడియోపై కామెంట్ చేశారు. కావ్య మంచి స్పోర్ట్స్‌మెన్ షిప్‌ను చూపించారని బెటర్‌ లక్ నెక్స్ట్ టైమ్ అంటూ ఆమెను ఓదార్చారు. కావ్యా చాలా అనుభవం ఉన్న బిజినెస్‌ ఉమన్ అని ... ఆమె త్వరలోనే దీని నుంచి బయటకు వస్తారు అని కొందరు వ్యాఖ్యలు చేశారు. 
ఏదైనా చాలా ఆశలు పెట్టుకున్న మ్యాచ్ ఇలా అవ్వడం కావ్యను బాగా కృంగదీసింది. ఫ్రాంచైజ్ హైదరాబాద్‌ అయినా తన సొంతవూరు చెన్నైలో ఇలా జరగడం ఆమెకు బాగా బాధ అనిపించింది. Better luck next time Kavya

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma :కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎందుకంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎందుకంటే?
Mann Ki Baat: అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
ICC T20 World Cup 2024: మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ, Anupama Parameswaran మూవీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్, ఈ డీటెయిల్స్ తెల్సా?
బెల్లంకొండ, Anupama Parameswaran మూవీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్, ఈ డీటెయిల్స్ తెల్సా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma :కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎందుకంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎందుకంటే?
Mann Ki Baat: అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
ICC T20 World Cup 2024: మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ, Anupama Parameswaran మూవీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్, ఈ డీటెయిల్స్ తెల్సా?
బెల్లంకొండ, Anupama Parameswaran మూవీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్, ఈ డీటెయిల్స్ తెల్సా?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Bachhala Malli: బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
Embed widget