అన్వేషించండి

IPL 2023: భవిష్యత్ సూపర్ స్టార్ అతనే - పంజాబ్ కింగ్స్ బ్యాటర్‌పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు!

ఐపీఎల్ 2023లో అద్భుతంగా రాణిస్తున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు మంచి భవిష్యత్తు ఉందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.

Indian Premier League 2023: ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టులో 22 ఏళ్ల కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ 65 బంతుల్లో 103 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్ నుండి జట్టు ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేశాడు.

ప్రభ్‌సిమ్రన్‌ రాణించడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఢిల్లీ జట్టు 138 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను ప్రశంసించాడు. ఇర్ఫాన్ ప్రభాస్‌ను భవిష్యత్ సూపర్ స్టార్ ఆటగాడిగా అభివర్ణించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ తన జట్టుకు సీనియర్ ఆటగాడిగా నటించాడని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. ‘గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభాస్‌సిమ్రన్ యువ ఆటగాడు, అందరిలాగే అతని దగ్గర కూడా మంచి షాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో అతను ఖచ్చితంగా పెద్ద ఆటగాడు అవుతాడని నేను భావిస్తున్నాను.’ అన్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌లు ఆడగా, ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. పంజాబ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. ఆ తర్వాత మే 19వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో ఈ సీజన్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ రెండింటిలోనూ పంజాబ్ గెలిస్తే ప్లేఆఫ్ రేసులో నిలవగలుగుతుంది. కానీ స్థానాన్ని నిర్ధారించుకోవడానికి, వారు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడవలసి ఉంటుంది.

ఐపీఎల్ 2023లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ 31 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో టోర్నమెంట్ నుంచి ఢిల్లీ అధికారికంగా అవుట్ అయింది.

ఢిల్లీ బ్యాటర్లలో కేవలం డేవిడ్ వార్నర్ మాత్రమే రాణించాడు. మిగతా వారెంరూ రాణించలేకపోయారు. ఇక పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (103: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ (103: 65 బంతుల్లో, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) మినహా ఎవ్వరూ రాణించలేదు. తనను ఒక ఎండ్‌లో నిలబెట్టి మరో ఎండ్‌లో వికెట్లు సమర్పించుకుంటూనే ఉంటారు. పవర్ ప్లేలోనే పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయింది. 

అయితే ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు శామ్ కరన్ (20: 24 బంతుల్లో, ఒక ఫోర్) కాసేపు క్రీజులో నిలిచాడు. కానీ పరుగులు మాత్రం వేగంగా చేయలేకపోయాడు. వీరు నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. శామ్ కరన్ అవుటయ్యాక ప్రభ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌లో వేగాన్ని పెంచాడు. శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అవుట్ కావడంతో పంజాబ్ ఎక్కువ పరుగులు చేయలేకపోయింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget