అన్వేషించండి

Navratri Day 5 Maha Chandi: మహా చండీదేవిగా కనక దుర్గమ్మ, ఈ అలంకారం విశిష్ఠత ఏంటో తెలుసా!

Navratri Day 5 Maha Chandi: అక్టోబరు 19 గురువారం ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు శ్రీ మహా చండీ దేవి అలంకారంలో దర్శనిమస్తోంది విజయవాడ కనకదుర్గమ్మ. ఈ అలంకారాన్ని దర్శించుకుంటే కలిగే శుభాలివే...

Navratri Day 5 Maha Chandi:  దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. 

చండీ ఎలా అవతరించింది

చండీ దేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, జగన్మాత, భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోర్కె నెరవేరుతుందని చెబుతారు. శరన్నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవి ప్రాముఖ్యత వేరు.  హిందూ పురాణాలు, హిందూ మత విశ్వాసాల ప్రకారం..రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా  శివుడి వద్దకు వెళ్ళి రాక్షసులు గురించి చెబుతారు. అప్పుడు పరమ శివుడు మాతృ దేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృ దేవతను ఆరాధించారు. అలా మాతృ దేవత అనుగ్రహంతో సరస్వతి దేవి, లక్ష్మీదేవి , మహాకాళి... చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. 

Also Read:  దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

నీల్ పర్వత శిఖరంపై చండీ ఆలయం

చండీ దేవి ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. రాక్షసులను సంహరించిన తర్వాత చండీ దేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్‌లో ఉన్న చండీ దేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య రూపొందించారని చెబుతారు. నవరాత్రుల తొమ్మిది రోజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

Also Read: రాజపుత్రుల జన్మస్థానంలో ఏం చేసినా రాజసమే-దసరా ఉత్సవాల నిర్వహణలో కూడా!

చండీ పూజ ఎలా చేస్తారు 

చండీ దేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజు ఆవు పేడ,  మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు. కలశంలో నీటిని తీసుకుని దానిని మామిడి ఆకులతో కప్పి, బియ్యంతో నిండిన మట్టి మూతని కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు. వేదమంత్రాలు చదువుతూ అదే కలశంలో కుండల నుంచి నీటిని చిలకరించి అమ్మవారిని ఆవాహనం చేస్తారు.  పూజ మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల ఈ కాలంలో వేద పండితులు కేవలం పండ్లు మాత్రమే తింటారు. చండీ దేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది తర్వాత హో ప్రారంభిస్తారు.  ఈ హోమాన్ని కలశం ముందు నిర్వహిస్తారు. 

Also Read : శక్తి ఉపాసనలో బెంగాలీయులకే అగ్ర తాంబూలం, కోల్ కతాలో దసరా వేడుకలు మరింత ప్రత్యేకం!

చండికా మంత్రం ఇదే

    ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్ఛే
    శ్రీ హ్రీం క్లీం గ్లౌన్ గన్ గణపతయే వర వరద్ సర్వజనం మే వష్మానాయ స్వాహా
    ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం వరః-ముఖాయ దుః-స్థాన్-శూల్-వేతలాయ క్రీం శ్రీం స్వాహా
    ఐం హ్రీం శ్రీం క్లీం చాముణ్డయై విచ్ఛే

ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం, ఆరోగ్యం పొందుతారని పండితులు చెబుతారు. 

Also Read : శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget