Bharat Gourav Train: విజయవాడ నుంచి తెలంగాణ, హరిద్వార్, రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్
Indian Railways | విజయవాడ నుంచి హరిద్వార్ రిషికేశ్, కలుపుతూ వైష్ణోదేవి, అమృత్ సర్ కు అమృత్ గౌరవ్ ట్రైన్ నడుస్తోంది. టికెట్ ధరలు, బుకింగ్ ఎలా చేసుకోవాలో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

వేసవి సెలవుల్లో అటు టూరిజం ఇటు ఆధ్యాత్మికం కలిసేలా విజయవాడ -సికింద్రాబాద్ నుండి అమృత్ గౌరవ్ రైలు ను ప్రకటించింది IRCTC. తొమ్మిది రాత్రులు పది పగళ్ళు ప్రయాణించే ఈ రైలు హరిద్వార్, రిషికేష్, ఆనంద్ పూర్, అమృత్ సర్, మాతా వైష్ణో దేవి లలోని వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కవర్ చేస్తూ సాగుతుంది.
బయలుదేరే తేదీ :
ఈ స్పెషల్ ట్రైన్ జర్నీ విజయవాడలో 24.04.2025 న బయలు దేరి 02.05.2025 న ముగుస్తుంది.
ట్రైన్ కు ఎక్కడెక్కడి నుండి రిజర్వేషన్ చేసుకోవచ్చు
విజయవాడలో బయలుదేరే ఈ ట్రైన్ కు విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజిపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్,బళ్లార్ష, వార్ధా, నాగపూర్ ల నుండి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అయా స్టేషన్ ల గుండా ఇ ట్రైన్ వెళుతుంది.
ఈ విజయవాడ భారత్ గౌరవ్ ట్రైన్ కవర్ చేసే ప్రదేశాలు ఏవంటే
హరిద్వార్ : మానసా దేవి ఆలయం, గంగా కీ హారతి (సాయంత్రం)
రిషి కేష్ : రామ్ ఝాల మరియు లక్ష్మణ్ ఝాల
ఆనంద్ పూర్: ఆనంద్ సాహిబ్-గురుద్వారా, నైనా దేవి ఆలయం
అమృత్ సర్: గోల్డెన్ టెంపుల్, వాఘా బోర్డర్ ( సమయాన్ని బట్టి)
వైష్ణో దేవి : శ్రీ మాతా వైష్ణో దేవి టెంపుల్
బుకింగ్ రేట్స్ ఇవే (ప్రతీ వ్యక్తి కీ)
1) ఎకానమీ : 18,510/-
ఈ క్యాటగిరిలో ట్రైన్ లో స్లీపర్ క్లాస్, నైట్ స్టే కోసం నాన్-ఏసీ హోటల్ రూమ్ (డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్), లోకల్ ట్రాన్స్ పోర్ట్ కోసం నాన్-ఏసీ వెహికల్ లో ప్రయాణం ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు చైల్డ్ అయితే (5 yrs నుండి 11 ఏళ్ల మధ్య) టికెట్ రేట్ 17,390 గా ఉంటుంది
2) స్టాండర్డ్ 30,730/-
ఈ క్యాటగిరిలో ట్రైన్ లో 3AC క్లాస్, నైట్ స్టే కోసం ఏసీ హోటల్ రూమ్ (డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్), లోకల్ ట్రాన్స్ పోర్ట్ కోసం నాన్-ఏసీ వెహికల్ లో ప్రయాణం ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు చైల్డ్ అయితే (5 yrs నుండి 11 ఏళ్ల మధ్య) టికెట్ రేట్ 29,420గా ఉంటుంది
3) కంఫర్ట్ 40,685/-
ఈ క్యాటగిరిలో ట్రైన్ లో 2AC క్లాస్, నైట్ స్టే కోసం ఏసీ హోటల్ రూమ్ (డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్), లోకల్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఏసీ వెహికల్ లో ప్రయాణం ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు చైల్డ్ అయితే (5 yrs నుండి 11 ఏళ్ల మధ్య) టికెట్ రేట్ 39,110 గా ఉంటుంది
ఎలా బుక్ చేసుకోవాలి
ఈ భారత్ గౌరవ్ రైల్లో టికెట్ బుకింగ్ www.irctctourism comవెబ్ సైట్ లో గానీ 040-27702407, 9701360701, 9281495845, 9281030750, 9281030740, 8287932228, 8287932229 నెంబర్లకు ఫోన్ చేసి గాని బుక్ చేసుకోవచ్చుని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ ఒక ప్రకటన లో తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

