Hyderabad Crime News: బాల్ తీసుకెళ్లేందుకు వెళ్తే విషాదం, లిఫ్ట్ మీద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే వ్యక్తి మృతిచెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
అపార్ట్‌మెంట్‌లో పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. బంతి లిఫ్ట్ గోతిలో పడిందని చెప్పడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. కానీ ప్రమాదవశాత్తూ అదే సమయంలో మూవ్ కావడంతో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్బర్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక ఉద్దేశపూర్వకంగా ప్రమాదం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. లిఫ్ట్ పక్కన చేసిన ఏర్పాట్లు, బంతి తీయడానికి వెళ్లిన స్పాట్‌ను పోలీసులు పరిశీలించారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















