News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

Dussehra 2023: శరన్నవరాత్రి వేడుకలు ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అలంకారాలు, ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితమో తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

Dussehra 2023

దశవిధాలైన పాపాలు హరించే 'దసరా'

దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచి అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిచ్చే అలంకారాలు- ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.

అక్టోబరు 15 ఆదివారం - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి -  శ్రీ బాలా త్రిపురసుందరి దేవి

మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే అమ్మ అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజు రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి పూజిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం

Also Read : శరన్నవరాత్రుల్లో పూజించాల్సిన నవదుర్గ అలంకారాలివే!

అక్టోబరు 16  సోమవారం - ఆశ్వయుజ శుద్ధ విదియ - శ్రీ గాయత్రీ దేవి

సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.

అక్టోబరు 17 మంగళవారం - ఆశ్వయుజ శుద్ధ తదియ - అన్నపూర్ణాదేవి

అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో కనిపించే అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. 

అక్టోబరు 18 బుధవారం- ఆశ్వయుజ శుద్ధ చవితి - శ్రీ మహాలక్ష్మీ దేవి 

ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ అలంకారాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.

అక్టోబరు 19 గురువారం- ఆశ్వయుజ శుద్ధ  పంచమి- శ్రీ మహా చండీ దేవి

చండీ దేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, జగన్మాత, భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోర్కె నెరవేరుతుందని చెబుతారు.

అక్టోబరు 20 శుక్రవారం - ఆశ్వయుజ శుద్ధ షష్టి - సరస్వతీ దేవి

సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవి దర్శనార్థం విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకూ మరింత పుణ్యదినాలుగా భావిస్తారు

Also Read: నవరాత్రి ఉత్సవాల్లో న‌వ‌దుర్గ‌ల‌కు ఏ రోజు ఏ రంగు వ‌స్త్రాలు, పూలు స‌మ‌ర్పించాలి

అక్టోబరు 21 శనివారం - ఆశ్వయుజ శుద్ధ సప్తమి - లలితా త్రిపుర సుందరి

సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా  చిరుమందహాసంతో.. చెరుకుగడను చేతపట్టుకుని కూర్చున్న లలితా త్రిపుల సుందరిని దర్శించుకున్నవారికి ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది

అక్టోబరు 22 ఆదివారం - ఆశ్వయుజ శుద్ధ అష్టమి - దుర్గాదేవి

లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయి. 

అక్టోబరు 23 సోమవారం- ఆశ్వయుజ శుద్ధ నవమి - మహిషాసుర మర్ధిని 

దుష్టుడైన మహిషాసురుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో  ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజాలు,అష్ట ఆయుధాలు, సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే.. భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 

Also Read: విజ‌య‌ద‌శ‌మి ప్రాశ‌స్త్యం, ఎలా జ‌రుపుకోవాలో తెలుసా!

అక్టోబరు 23 సోమవారం మధ్యాహ్నం - ఆశ్వయుజ శుద్ధ దశమి- రాజరాజేశ్వరి దేవి

వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి రోజు అమ్మవారి  రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. దశమి రోజు  ఆయుధ పూజ చేసేవారు అక్టోబరు 24 మంగళవారం సూర్యోదయానికి దశమి తిథి ఉండడంతో ఆ రోజు చేస్తారు.

Published at : 03 Oct 2023 06:24 AM (IST) Tags: Dussehra 2023 puja time navratri dussehra 2023 2023 Vijayadashami Dasara Dussehra Puja Date and Time vijayawada indrakeeladri dasara 2023 Ravan dahan 2023

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌

Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్‌- తప్పులేదన్న సజ్జనార్‌